పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా ఎలాంటిదో మరోసారి రుజువైంది. మూడేళ్లకు పైగా విరామం తీసుకుని, లేడీ ఓరియెంటెడ్ సినిమా రీమేక్‌తో ఆయన రీఎంట్రీ ఇచ్చినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ‘వకీల్ సాబ్’ అంచనాల్ని మించి వసూళ్లు రాబడుతోంది.
ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ మూవీ అవడం, పైగా రీమేక్ కావడం ప్రతికూల విషయాలే. పైగా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉంది. ఏపీలో చూస్తే టికెట్ల రేట్లపై నియంత్రణ కొనసాగుతోంది. ఇన్ని ప్రతికూలతల్లోనూ ‘వకీల్ సాబ్’ జోరు సాగుతుండటం విశేషం. తొలి వారాంతంలోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.50 కోట్లకు పైగా షేర్ సాధించడం విశేషం. కరెక్ట్ ఫిగర్స్ రావడానికి టైం పట్టేలా ఉంది కానీ.. రూ.50 కోట్ల షేర్ మార్కును అయితే ఈ చిత్రం దాటేసిందన్నది స్పష్టం. గ్రాస్ రూ.75-80 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే గ్రాస్ రూ.100 కోట్లు దాటబోతోంది.
ఇక షేర్ రూ.100 కోట్ల మార్కును అందుకోవడం కూడా సాధ్యమే అనిపిస్తోంది. ఎందుకంటే మంగళవారం ఉగాది సెలవు కలిసొస్తోంది. ఇక వచ్చే రెండు వారాలకు కొత్త సినిమాలేవీ విడుదలయ్యే సూచనలు లేవు. లవ్ స్టోరి, టక్ జగదీష్ వాయిదా పడిపోయాయి. ఇంకే పేరున్న సినిమా రిలీజయ్యేలా లేదు. వచ్చే రెండు వారాలు థియేటర్లను బతికించాల్సింది ఈ సినిమానే.
కొన్ని థియేటర్లు తగ్గినా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో ఈ సినిమా కొనసాగబోతోంది. ప్రేక్షకులకు వేరే ఛాయిస్ కనిపిస్తే పాత సినిమాను పక్కన పెట్టేస్తారు కానీ.. అలా లేనపుడు ముందు వారంలో వచ్చిన సినిమా చూసుకోవాల్సిందే. ఫ్యామిలీస్, లేడీస్‌ను ఆకర్షించే సినిమా కావడం ‘వకీల్ సాబ్’కు కలిసొచ్చే అంశం. ఒకవేళ 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం అమల్లో పెట్టినా అది పెద్ద ఇబ్బంది కాదు. మాగ్జిమం థియేటర్లలో ఈ సినిమా ఆడుతుంది కాబట్టి ఫుల్ రన్లో రూ.100 కోట్ల షేర్ క్లబ్బులో చేరిన తొలి పవన్ కళ్యాణ్ సినిమాగా ‘వకీల్ సాబ్’ నిలిచే అవకాశాలున్నాయి.
This post was last modified on April 12, 2021 10:23 pm
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…