Trends

రూ.20 వేల కోట్ల ఆస్తి.. అమెరికాలో గవర్నర్ రేసులో మనోడు!

అమెరికాలో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి మరోసారి ఫోకస్ లోకి వచ్చారు. గతంలో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని ప్రయత్నించిన ఆయన ఇప్పుడు ఒహాయో రాష్ట్ర గవర్నర్ పదవి కోసం బరిలో ఉన్నారు. అయితే వివేక్ గురించి ఇప్పుడు బయటకు వచ్చిన ఓ విషయం ఆసక్తికరంగా ఉంది. ఆయన ఆస్తుల విలువ ఏకంగా రూ.20 వేల కోట్లకు పైమాటే. ఎన్నికల్లో గెలిస్తే అమెరికాలో అత్యంత ధనవంతులైన ప్రజాప్రతినిధుల్లో మూడో స్థానంలో నిలుస్తారు.

41 ఏళ్ల వివేక్ రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అమీ ఆక్టన్ ప్రధాన ప్రత్యర్థి. నవంబర్ 3న ఎన్నికలు జరుగుతున్నాయి. వివేక్ గెలిస్తే ఒహాయో గవర్నర్ అయిన తొలి భారతీయ అమెరికన్ అవుతారు. అంతేకాదు, అమెరికాలో ప్రస్తుతం ఉన్న గవర్నర్లలో రెండో అత్యంత ధనవంతుడిగా నిలుస్తారు.

ఫోర్బ్స్ ప్రకారం వివేక్ ఆస్తుల విలువ 220 కోట్ల డాలర్లు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్తులు దాదాపు 700 కోట్ల డాలర్లు కాగా, ఇల్లినాయ్ గవర్నర్ జేబీ ప్రిట్జ్‌కర్‌కు 420 కోట్ల డాలర్ల సంపద ఉంది. వివేక్ గెలిస్తే ఈ ఇద్దరి తర్వాతి స్థానంలో ఉంటారు. అయితే ఆయనకు ఇంత డబ్బు రాజకీయాల ద్వారా రాలేదు. సొంతంగా స్థాపించిన ఔషధ పరిశోధన కంపెనీ ద్వారా సంపాదించారు.

వివేక్ తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వెళ్లారు. ఆయన ఒహాయోలోని సిన్సినాటిలో జన్మించారు. హార్వర్డ్‌లో చదివిన వివేక్ 2014లో రోవాంట్ సైన్సెస్ అనే కంపెనీని ప్రారంభించారు. కొత్త ఔషధాలను అభివృద్ధి చేసే ఈ కంపెనీ ద్వారా ఆయన బిలియనీర్ అయ్యారు. గత ఏడాది కంపెనీ షేర్లను విక్రయించి భారీ మొత్తంలో డబ్బు సంపాదించినట్లు ఫోర్బ్స్ తెలిపింది.

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివేక్ మొదట రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. తర్వాత తప్పుకొని ట్రంప్‌కు మద్దతిచ్చారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఎలాన్ మస్క్‌తో కలిసి ప్రభుత్వ ఖర్చులు తగ్గించే బాధ్యతలు చేపట్టేందుకు ఎంపికయ్యారు. కానీ గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఆ పని నుంచి తప్పుకున్నారు.

ఇక ఎన్నికల ప్రచారంలో వివేక్ సంపదనే ప్రత్యర్థులు ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ఆయన ప్రైవేట్ విమానాల్లో తిరుగుతారని, సామాన్యుల కష్టాలు తెలియవని అమీ ఆక్టన్ విమర్శిస్తున్నారు. వివేక్ మాత్రం తన వ్యాపార అనుభవంతో ఒహాయోలో ఉద్యోగాలు పెంచుతానని చెబుతున్నారు. ఈ రాష్ట్రంలో గత 20 ఏళ్లుగా రిపబ్లికన్ పార్టీయే గవర్నర్ ఎన్నికల్లో గెలుస్తోంది. ఆ ఆధిపత్యాన్ని కొనసాగించాలని వివేక్ ప్రయత్నిస్తుండగా, అమీ ఆక్టన్ దానికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు.

This post was last modified on November 3, 2026 8:40 pm

Share

Recent Posts

సీఎంను విమర్శిస్తే కేసులా.. పోలీసులకు హైకోర్టు క్లాస్!

అధికారంలో ఉన్నవారిపై విమర్శలు చేసినందుకు కేసులు పెట్టడం, అరెస్టులకు సిద్ధపడటం వంటి వ్యవహారాలపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.…

3 hours ago

SRH బౌలింగ్‌లో భారీ మార్పులు.. CSKతో డీల్?

ఐపీఎల్ 2027 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌ను బలోపేతం చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి…

5 hours ago

శ్రీలీల.. పెద్ద షాకే ఇవ్వ‌బోతోంది

కొన్ని రోజుల ముందు వ‌ర‌కు శ్రీలీల ప‌నైపోయిందంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున టాక్ న‌డిచింది. తెలుగులో అవ‌కాశాలు త‌గ్గిపోయాయి.…

5 hours ago

ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉన్నారు.. ఆర్భాటాలు వ‌ద్దు..

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కూట‌మి పార్టీలు ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్నాయి. దాదాపు అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో కూట‌మి పార్టీలే…

6 hours ago

హ‌మ్మ‌య్య నిలిచాం.. జ‌గ‌న్‌కు ఇదొక్క‌టే మిగిలిందా.. ?

పార్టీ ప‌రంగా గెలుపు ఓట‌ములు ఎలా ఉన్నా.. కీల‌క‌మైన ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డ‌మే గొప్ప అనేలా వైసీపీ వ్య‌వ‌హారం ఉందా?…

6 hours ago

పులివెందులలో మరీ ఇంత దారుణంగా ఓడిపోయిందా?

రాష్ట్రం మొత్తంలో వైసీపీ ప‌రిస్థితి, జ‌గ‌న్ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. త‌మ‌కు పుట్టిల్ల‌యిన‌.. పులివెందుల‌లో మాత్రం ఒక ప్ర‌తిష్టాత్మ‌కం. అందుకే…

7 hours ago