స్టార్ హీరోల సినిమాలకు తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రావడం ఎంత ముఖ్యమో తెలిసిందే. అందుకే ఎక్కువ షోలు వేసుకునేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు తమిళనాడులో రోజుకు ఆరు షోల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి దాటే వరకు సినిమాలు ప్రదర్శించే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
అయితే ఈ విధానం అమల్లోకి వస్తే ఓపెనింగ్స్ పెరగొచ్చు కానీ లాంగ్ రన్ పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా వస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో కొత్త సినిమాలకు మొదటి వారం రోజుకు ఐదు షోల అనుమతి ఉంది. దాన్ని ఆరుకు పెంచితే స్టార్ హీరోల సినిమాలకు మరింత అడ్వాంటేజ్ ఉంటుంది. ముఖ్యంగా తొలి మూడు రోజుల్లో టికెట్లకు భారీ డిమాండ్ ఉన్నప్పుడు అదనపు షోలతో ఎక్కువ వసూళ్లు రాబట్టుకోవచ్చు.
నెక్స్ట్ సూర్య ‘సీన్’ లాంటి సినిమాలకు ఈ అవకాశం కలిసొచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. సాధారణంగా వారం రోజుల పాటు సినిమా చూసే ప్రేక్షకులు అదనపు షోల కారణంగా మొదటి మూడు నాలుగు రోజుల్లోనే చూసేస్తే రెండో వారంలో డిమాండ్ తగ్గొచ్చు. ముఖ్యంగా యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు ఈ పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఎక్కువ.
పైగా ఆరు షోలు వేసినంత మాత్రాన అన్నింటికీ హౌస్‌ఫుల్ బోర్డులు పడవు. నాలుగు షోలకు వచ్చే ప్రేక్షకులే ఆరు షోలకు పంచుకుంటే ఆక్యుపెన్సీ తగ్గుతుంది. దీంతో థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరిగినా అదనపు ఆదాయం పెద్దగా ఉండకపోవచ్చు. మరోవైపు మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలకు మాత్రం ఎక్కువ షోలు ఉపయోగపడతాయి. టికెట్లు దొరక్క వెనక్కి వెళ్లే ప్రేక్షకులను కూడా థియేటర్లకు రప్పించవచ్చు. అయితే మొదటి వారంలోనే ఎక్కువ బిజినెస్ పూర్తయితే రెండో వారం నుంచి షోలు తగ్గించే పరిస్థితి రావచ్చు. కొత్త సినిమాల పోటీ కూడా తోడైతే లాంగ్ రన్ మరింత కష్టమవుతుంది.
This post was last modified on November 3, 2026 9:00 pm
అమెరికాలో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి మరోసారి ఫోకస్ లోకి వచ్చారు. గతంలో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ…
అధికారంలో ఉన్నవారిపై విమర్శలు చేసినందుకు కేసులు పెట్టడం, అరెస్టులకు సిద్ధపడటం వంటి వ్యవహారాలపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.…
ఐపీఎల్ 2027 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌ను బలోపేతం చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి…
కొన్ని రోజుల ముందు వరకు శ్రీలీల పనైపోయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టాక్ నడిచింది. తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.…
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీలు ఘన విజయం దక్కించుకున్నాయి. దాదాపు అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కూటమి పార్టీలే…
పార్టీ పరంగా గెలుపు ఓటములు ఎలా ఉన్నా.. కీలకమైన ఎన్నికల్లో పోటీ చేయడమే గొప్ప అనేలా వైసీపీ వ్యవహారం ఉందా?…