తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు. కొంచెం క్రేజున్న సినిమా వస్తోందంటే అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎగబడిపోతారు. సినిమా అనేది తెలుగు వాళ్ల జీవితాల్లో ఒక భాగం. అదొక బలహీనత. దేశం దాటినా సరే.. ఆ బలహీనత వీడిపోదు. రేటు ఎక్కువైనా, చాలా దూరం ప్రయాణించి సినిమా చూడాల్సి వచ్చినా వెనుకంజ వేయరు.
కానీ ఈ సినిమా ప్రేమను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు క్యాష్ చేసుకుంటున్నారనే చర్చ ఇటీవల పెద్ద ఎత్తున నడుస్తోంది. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ‘జైలర్-2’కు ఏపీలో టికెట్ల ధరలు పెంచడం పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇదే సమయంలో తెలుగు చిత్రమైన ‘రణబాలి’ ఏపీ, తెలంగాణల్లో నార్మల్ రేట్లతో రిలీజవుతుండడం విశేషం. కానీ ఈ సినిమాకు యుఎస్‌లో మాత్రం కొంచెం ఎక్కువ రేట్లే పెట్టారు. అది బూమరాంగ్ అయింది.
‘రణబాలి’కి రిలీజ్ ముంగిట హైప్ ఒక మోస్తరు స్థాయిలోనే ఉంది. సినిమా కోసం జనం ఎగబడే పరిస్థితి లేదు. ఇలాంటి సినిమా ప్రిమియర్స్‌కు ఎక్కువ రేటు పెట్టడం, డే-1 నుంచి కూడా ధరలు అందుబాటులో లేకపోవడంతో యుఎస్ ఆడియన్స్‌లో అసంతృప్త స్వరాలు వినిపించాయి. ఆ ప్రభావం ప్రి సేల్స్ మీద పడింది. చాలా డల్లుగా సేల్స్ జరగడంతో విజయ్ చివరి చిత్రం ‘కింగ్డమ్’ వసూళ్లకు దరిదాపుల్లో కూడా లేని పరిస్థితి.
రోజులు గడుస్తున్నా టికెట్లు తెగకపోవడంతో యుఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆలోచనలో పడింది. పాస్‌లు అన్నీ ఎనేబుల్ చేసి ప్రిమియర్స్‌తో పాటు రెగ్యులర్ షోల రేట్లను అందుబాటులోకి తెచ్చారు. దీంతో సేల్స్ ఊపందుకున్నాయి. ఒక రకంగా ఇది ప్రేక్షకుల విజయం అని చెప్పాలి. ఎగబడి టికెట్లు కొనకపోవడం ద్వారా అధిక ధరల పట్ల తమ నిరసనను తెలియజేశారు. దీంతో డిస్ట్రిబ్యూటర్ దిగి రావాల్సి వచ్చింది. మున్ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆడియన్స్ ఇలాగే రియాక్టయితే తప్ప హైక్స్‌కు బ్రేక్ పడదేమో.
This post was last modified on October 11, 2026 3:00 pm
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…