ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన వారంతా 20 సంవత్సరాల లోపు యువకులు కావడంతో గమనార్హం. దీంతో చేతికి అందివస్తారనుకున్న పిల్లలు కళ్ళ ముందే చనిపోవడంతో ఆ కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఘటన సమాచారం తెలిసిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తం అయింది. తెలంగాణా వ్యాప్తంగా చెరువులు, కుంటల వద్ద ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
తెలంగాణాలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామానికి చెందిన బీటెక్ చదువుతున్న నరసింహ రాజు ,డిప్లమా చదువుకుంటున్న సుమంత్, గణేష్,ఉదయ్ కిరణ్,శ్యామ్ కుమార్ లతో పాటుగా 10 వ తరగతి చదువుతున్న 15 ఏళ్ళ బాలుడు సిద్ధార్థ్ గణేష్ గ్రామంలో జరుగుతున్న నిమజ్జనంలో పాల్గొన్నారు. అప్పటి వరకు హుషారుగా ఆడుతూ పాడారు. గ్రామ శివారులోని నేరేడు చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడిపోయారు.
కళ్ళు మూసి తెరిచే లోపలే విగత జీవులుగా మారారు. వినాయక చవితి పండుగ సందర్బంగా మూడు రోజులుగా గ్రామంలో జరుగుతున్న వేడుకలు విషాదంగా ముగిశాయి. స్థానికంగా వున్న శిరీషా చారిటబుల్ ట్రస్టులో క్రియశీలకంగా పనిచేస్తూ గ్రామంలో తలలో నాలుకలా వుండే యువకులు చనిపోవడంతో గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. వారి తలిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావట్లేదు.
ఈ దుర్ఘటన సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు, పెద్దకంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు మృతి చెందడం విషాదకరం, ఈ దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను .పండుగ సమయంలో జరిగిన ఈ విషాదం తనను ఎంతగానో కలిచి వేసిందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ప్రభుత్వ అధికారిక ఖాతాలో ట్విట్ చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణాలోని అన్నీ గ్రామాలు, పట్టణాల్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
This post was last modified on September 17, 2026 10:07 am
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌కు అమెరికా నుంచి మరో టారిఫ్ ముప్పు దగ్గరైంది. రష్యాపై మరింత ఆర్థిక…
ప్రముఖ కర్ణాటక సంగీత విదుషి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి స్మారక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భావోద్వేగానికి గురయ్యారు.…
ఆలిండియా నెంబర్ 1 హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీదేవికి చెందిన భూముల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ…
ఐ బొమ్మ రవి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలను ఫాలో అయ్యే వాళ్లందరికీ ఈ పేరు పరిచయమే.…
తిరుమల తిరుపతి పర్యటనకు వెళ్లేవారికి శ్రీవారిని దర్శించుకోవడం.. మొక్కులు చెల్లించుకోవడం.. స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించడం గొప్ప అనుభూతి. శ్రీవారిని…