Movie News

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు ఏ ఏరియాలో బ్రేక్ ఈవెన్ కాకపోవడం తీవ్రంగా నిరాశ పరిచింది. అయితే కెవిఎన్ సంస్థతో ఆయన చేసుకున్న ఒప్పందాలు ఎక్కువగా బయటికి రాలేదు కానీ, టాక్సిక్ లో పార్ట్ నర్ గానూ ఉన్న యష్ రామాయణ హక్కులు ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్టు వచ్చిన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో బాగా తిరిగింది. కారణం అదేనని చెప్పలేం కానీ ఎట్టకేలకు ఆ విజువల్ గ్రాండియర్ రాజుగారి చేతికే వచ్చిందట.

నవంబర్ 4 ప్రీమియర్లతో మొదలుపెట్టి అయిదో తేదీ గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. హిందీ తెలుగు వెర్షన్లను పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు థియేటర్ అగ్రిమెంట్లు ఈ వారంలోనే మొదలైపోవచ్చని టాక్. టాక్సిక్ ఏదైతే చేదు జ్ఞాపకాలు మిగిల్చిందో వాటిని పోగొట్టే బాధ్యత రామాయణ తీసుకోవాలి. అయితే ఇక్కడ కొన్ని రిస్కులు లేకపోలేదు. రామాయణ మీద కింది స్థాయిలో అరివీర భయంకరమైన బజ్ లేదు. ఎలా ఉంటుందనే ఆసక్తి ఆడియన్స్ లో అయితే ఉంది.

ఓపెనింగ్స్ ఘనంగా రావాలంటే మొదటి వారంలోనే చూసి తీరాలని జనం ఫిక్స్ అయ్యేంత ఎగ్జైట్ మెంట్ సృష్టించాలి. టీమ్ అదే పనిలో ఉందట. ఇప్పటిదాకా చేసిన ప్రమోషన్లు ఒక ఎత్తు, ఇకపై మరో ఎత్తు అనిపించేలా పబ్లిసిటీ డిజైన్ చేశారని ముంబై రిపోర్ట్. కేవలం నార్త్ కే పరిమితం కాకుండా ఉత్తరాది రాష్ట్రాల ప్రధాన నగరాలూ అన్ని తిరిగి విస్తృత ప్రచారం చేయబోతున్నారు. బ్రహ్మాస్త్ర పార్ట్ 1కి ఈ స్ట్రాటజీ వాడిన కరణ్ జోహార్ ఆ సమయంలో మంచి ఫలితం అందుకున్నారు.

ఇప్పుడు రామాయణ కనక సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా తర్వాత వచ్చే పార్ట్ 2కి విపరీతమైన హైప్ నెలకొంటుంది. రన్బీర్ కపూర్, సాయిపల్లవి, యష్, సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ లాంటి క్యాస్టింగ్ పబ్లిక్ లో అంచనాలు రేపుతోంది. అయితే ట్రైలర్ కు వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకుని త్వరలో మరో వెర్షన్ సిద్ధం చేస్తారని తెలిసింది. ఓవర్సీస్ మార్కెట్ లో గాడ్జిల్లా మైనస్ జీరో రూపంలో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో రామాయణ టాక్ యునానిమస్ గా రావాల్సిందే.

This post was last modified on October 7, 2026 9:54 pm

Share

Recent Posts

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

2 hours ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

2 hours ago

‘బ్రేకింగ్ బ్యాడ్’తో ‘జైలర్‌’కేం పని?

అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…

3 hours ago

గుంత కనిపిస్తే AI చూసుకుంటుంది

రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు చాలామంది చేస్తుంటారు. కానీ ఆ గుంతను బాగు…

3 hours ago

ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయం తీర్చాల్సిందే

ఫౌజీ వాయిదా పడింది. సంతోషం. ఇలాంటి పోస్టుపోన్లు చూడటం కొత్తేమి కాదు కాబట్టి అందులో ఫీలవ్వడానికి ఏం లేదు. మరి…

4 hours ago

రోడ్డుపై పడుకొని ప్రియాంకా గాంధీ నిరసన

ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో వివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్…

4 hours ago