అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి వీడియోలు అక్కడ బాగా పాపులర్. సోషల్ మీడియాలో కామెడీ చేయడానికి, మీమ్ టెంప్లేట్లకు అతడి వీడియోలను బాగా వాడుతుంటారు నెటిజన్లు. చిత్రమైన భాష, యాసతో బూతులతో ఎన్నో ఏళ్ల నుంచి సోషల్ మీడియా జనాలను అలరిస్తున్న అగ్గిపెట్టి మచ్చా చనిపోయాడనే వార్త.. తన వల్ల ఇంతకాలం నవ్వుకున్న వాళ్లందరినీ ఇప్పుడు బాధిస్తోంది.
అగ్గిపెట్టి మచ్చా అసలు పేరు.. కిరణ్‌కుమార్. అతను తిరుపతి ప్రాంతానికి చెందిన వాడు. తిరుపతి రూరల్‌లో ఉండే వైఎస్సార్ కాలనీ అతడి స్వస్తలం. సోషల్ మీడియాలో చూసే వీడియోలన్నీ ఇక్కడ ఉన్న తన ఇంటి దగ్గర తీసినవే. ఐతే కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టి మచ్చాక విపరీతంగా మద్యం తాగే అలవాటు ఉందట. తన వీడియోల్లో కూడా అతను ఎక్కువగా మందుకొట్టి ఉన్నపుడు తీసినవే ఉంటాయి. ఆ టైంలో విపరీత ప్రవర్తనతోనే అతను సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాడు కూడా.
ఐతే ఈ చెడు అలవాటు అతడి ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీసింది. ఐదు రోజుల కిందట తీవ్ర అనారోగ్యం పాలైన కిరణ్‌ను తిరుపతిలోని ఫేమస్ స్విమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. కానీ చికిత్స తర్వాత కూడా ఆరోగ్యం మెరుగుపడలేదు. రెండు రోజుల కిందట అతను వెంటిలేటర్ మీదికి వెళ్లిపోయాడు. పరిస్థితి విషమించి బుధవారం రోజు కిరణ్ తుది శ్వాస విడిచాడు. అతడి మృతదేహాన్ని వైఎస్సార్ కాలనీకి తరలించారు. అంత్యక్రియలు గురువారం జరుగుతాయని సమాచారం.
సోషల్ మీడియా ద్వారా వచ్చిన పాపులారిటీతో ఒక మీమ్ టెంప్లేట్‌గా మారి అందరినీ నవ్విస్తూ వచ్చిన అగ్గిపెట్టి మచ్చా.. ఇప్పుడిలా విషాద వార్తగా మారిపోవడం విచారకరం. సోషల్ మీడియాలో అగ్గిపెట్టి మచ్చా మరణం గురించి నెటిజన్లు స్పందిస్తున్న తీరు చూస్తుంటే.. తనది సామాన్యమైన పాపులారిటీ కాదని అర్థమవుతుంది.
This post was last modified on October 7, 2026 8:32 pm
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…
అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు చాలామంది చేస్తుంటారు. కానీ ఆ గుంతను బాగు…
ఫౌజీ వాయిదా పడింది. సంతోషం. ఇలాంటి పోస్టుపోన్లు చూడటం కొత్తేమి కాదు కాబట్టి అందులో ఫీలవ్వడానికి ఏం లేదు. మరి…
ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో వివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్…
మన దేశంలో పాదచారుల కోసం రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ ల మీద బడ్డీ కొట్లు మొదలు...జ్యూస్…