Trends

చివరి మ్యాచ్‌లోనూ అదే మెస్సీ… వారసుడికే గోల్ ఇచ్చి వెళ్లాడు!

21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్ చూపించాడు. బెనిన్‌తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ తో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు చెప్పాడు. అర్జెంటీనా 3-0తో గెలిచిన ఈ మ్యాచ్‌లో ఒక గోల్ చేసిన మెస్సీ.. మరో రెండు గోల్స్‌కు అసిస్ట్ ఇచ్చాడు. 39 ఏళ్ల వయసులో చివరిసారి అర్జెంటీనా జెర్సీ వేసుకున్న మెస్సీకి 85 వేల మందికి పైగా అభిమానులు వీడ్కోలు పలికారు.

ఫస్ట్ హాఫ్‌లో ఒక్క గోల్ కూడా రాలేదు. సెకండ్ హాఫ్‌లో అర్జెంటీనా మూడు గోల్స్ చేసింది. మొదటి గోల్‌కు మెస్సీ నుంచి పాస్ అందుకున్న నికోలస్ ఒటామెండి బంతిని నెట్‌లోకి పంపాడు. మెస్సీతో కలిసి 17 ఏళ్లుగా అర్జెంటీనాకు ఆడిన ఒటామెండికి కూడా ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.

రెండో గోల్ దగ్గర మరో ప్రత్యేకమైన సీన్ కనిపించింది. మెస్సీ ఇచ్చిన పాస్‌ను నికో పాజ్ గోల్‌గా మార్చాడు. 22 ఏళ్ల పాజ్‌ను అర్జెంటీనా భవిష్యత్‌లో నంబర్ 10 జెర్సీ వేసుకునే ఆటగాళ్లలో ఒకరిగా చూస్తోంది. మెస్సీ చివరి మ్యాచ్‌లో తన తర్వాత నంబర్ 10కు పోటీ పడుతున్న యువ ఆటగాడికే గోల్ అందించడం అభిమానులను ఆకట్టుకుంది. అక్కడితో మెస్సీ ఆగలేదు. మ్యాచ్ చివర్లో వచ్చిన పెనాల్టీని గోల్‌గా మార్చాడు. దీంతో అర్జెంటీనా తరఫున మెస్సీ గోల్స్ సంఖ్య 126కు చేరింది. మొత్తం 208 అంతర్జాతీయ మ్యాచ్‌లతో కెరీర్ ముగించాడు. అర్జెంటీనా తరఫున అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్ రికార్డులు రెండూ మెస్సీ పేరుతోనే ఉన్నాయి.

మ్యాచ్ ముగిసిన తర్వాత మెస్సీని ఆటగాళ్లు చుట్టుముట్టి వీడ్కోలు పలికారు. స్టేడియంలో డ్రోన్ షో నిర్వహించారు. మెస్సీ స్వస్థలం రొసారియోలో భారీ నంబర్ 10 జెర్సీపై ‘గ్రాసియాస్’ అని రాసి ప్రదర్శించారు. 2005లో మొదలైన అర్జెంటీనా ప్రయాణం 2026లో 208వ మ్యాచ్‌తో ముగిసింది. క్లబ్ ఫుట్‌బాల్‌లో మాత్రం మెస్సీ ఇంటర్ మయామీ తరఫున కొనసాగనున్నాడు.

This post was last modified on October 7, 2026 12:55 pm

Share

Recent Posts

కనెక్ట్ అయితే కుటుంబానికి కనకవర్షమే

ఇంకో అయిదు రోజులో ఆదర్శ కుటుంబం ఏకే 47 విడుదల కానుంది. ముందు నుంచి కొంత నెగటివిటీ నడిచినప్పటికీ ట్రైలర్…

17 minutes ago

ఇంత ‘కల్ట్’ ఫాలోయింగ్ ఊహించలేదేమో

ఒకప్పుడు హీరోలకు షూటింగ్ లేని టైంలో వాళ్ళను కలుసుకునేందుకు అభిమానులు నేరుగా ఇళ్ల వద్దకు వెళ్ళేవాళ్ళు. స్టార్లు కూడా విసుక్కోకుండా…

1 hour ago

హిట్ట‌యితే వంద‌లు… ఫ్లాప్ అయితే ఒక‌ట్లు

ప‌దేళ్ల కింద‌ట ప్రేమమ్ సినిమాతో సౌత్ ఇండియా అంత‌టా విప‌రీత‌మైన పాపులారిటీ సంపాదించాడు మ‌ల‌యాళ న‌టుడు నివిన్ పౌలీ. ఆ…

3 hours ago

నేత‌ల వైఖ‌రితో చంద్ర‌బాబు.. జ‌గ‌న్ వైఖ‌రితో నేత‌లు..

ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అంతా బాగుంద‌న్న ఫీలింగ్ ఆయా పార్టీల్లో పైకే క‌నిపిస్తోంది. అంత‌ర్గ‌తంగా చూస్తే..…

6 hours ago

బిల్డప్ ఇచ్చిన సినిమాకు టాక్ ఏంటి

ఫ్యామిలీ మ్యాన్ పుణ్యమాని ఓటిటి ప్రపంచంలో చాలా డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల్లో ఒకరిగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ కొత్త…

7 hours ago

తెలంగాణ బీజేపీకి కరెక్ట్ ఇంచార్జి దొరికినట్టేనా?

తెలంగాణ బీజేపీ ఇంచార్జ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సునీల్ బన్సల్ .. తొలి ప‌ర్య‌ట‌న‌లోనే నేత‌ల‌ను లైన్‌లో పెట్టే చ‌ర్య‌ల దిశ‌గా…

8 hours ago