Political News

భారత్‌పై 100 శాతం టారిఫ్.. ఇప్పుడు ట్రంప్ చేతిలోనే!

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌కు అమెరికా నుంచి మరో టారిఫ్ ముప్పు దగ్గరైంది. రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు తీసుకొచ్చిన కీలక ఆంక్షల బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ప్రతినిధుల సభలో ఈ బిల్లు 262-159 ఓట్లతో పాస్ అయింది. సెనేట్ ఇప్పటికే గత నెలలో దీనికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తే ఇది చట్టంగా మారుతుంది.

ఈ బిల్లులో భారత్‌కు సంబంధించిన కీలక అంశం రష్యా చమురు, గ్యాస్ కొనుగోళ్లు. రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై గరిష్ఠంగా 100 శాతం వరకు టారిఫ్ విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఇవ్వనున్నారు. భారత్‌తో పాటు చైనా కూడా రష్యా ఇంధనాన్ని భారీగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో ఉంది.

అయితే బిల్లు చట్టంగా మారిన వెంటనే భారత వస్తువులపై 100 శాతం టారిఫ్ పడిపోదు. ఎంత టారిఫ్ విధించాలి, ఎప్పుడు అమలు చేయాలి అనే విషయంలో ట్రంప్‌కు అధికారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు చమురు, గ్యాస్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించడమే ఈ బిల్లు అసలు టార్గెట్.

రష్యా ఇంధన రంగంతో పాటు బ్యాంకులు, రక్షణ రంగం, ఇప్పటికే ఉన్న ఆంక్షలను తప్పించుకుని చమురు రవాణా చేస్తున్న నౌకలను కూడా కొత్త చర్యలు లక్ష్యంగా చేసుకుంటాయి. భారత్‌కు రష్యా చమురు కీలకంగా మారడానికి ధర కూడా ప్రధాన కారణం. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో తక్కువ ధరకు లభించిన రష్యా క్రూడ్‌ను భారత రిఫైనరీలు భారీగా కొనుగోలు చేశాయి. అమెరికా మాత్రం ఈ కొనుగోళ్ల వల్ల రష్యాకు ఆదాయం కొనసాగుతోందని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఇప్పుడు బిల్లు ట్రంప్ సంతకం కోసం వైట్‌హౌస్‌కు వెళ్తోంది. ఆయన సంతకం తర్వాత భారత్‌పై కొత్త టారిఫ్ అధికారాన్ని ఎలా ఉపయోగిస్తారన్నది చూడాలి. మరోవైపు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 1 వరకు అమెరికాలో జరిగే జీ20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.

This post was last modified on September 17, 2026 10:03 am

Share

Recent Posts

సర్దార్ చేసిన గాయం చాలా పెద్దది

మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…

37 minutes ago

మెగా అప్‌డేట్…. మిసెస్ కాకా వచ్చేశారా

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…

2 hours ago

గణేష్ నిమజ్జనంలో ఆరుగురు విద్యార్థులు మృతి

ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…

2 hours ago

సుబ్బులక్ష్మిని తలచుకుని నిర్మలమ్మ కంటతడి

ప్రముఖ కర్ణాటక సంగీత విదుషి ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి స్మారక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భావోద్వేగానికి గురయ్యారు.…

3 hours ago

500 కోట్ల.. శ్రీదేవి ఆస్తి వివాదం.. చివ‌ర‌కు ఏమైదంటే!

ఆలిండియా నెంబ‌ర్ 1 హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న న‌టి శ్రీదేవికి చెందిన భూముల వివాదంపై సుప్రీంకోర్టు కీల‌క ఉత్త‌ర్వులు జారీ…

5 hours ago

కుటుంబాన్ని పోషించుకోలేక‌పోతున్నా.. ఐబొమ్మ ర‌వి ఆవేద‌న‌

ఐ బొమ్మ ర‌వి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు సినిమాల‌ను ఫాలో అయ్యే వాళ్లంద‌రికీ ఈ పేరు ప‌రిచ‌య‌మే.…

8 hours ago