Movie News

మెగా అప్‌డేట్…. మిసెస్ కాకా వచ్చేశారా

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్ లో ఉండిపోయింది. ముందు నుంచి ప్రియమణి పేరు వినిపించింది కానీ తాజాగా ఆ స్థానాన్ని స్నేహకు ఇచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. వినయ విధేయ రామలో రామ్ చరణ్ వదినగా నటించిన తర్వాతా ఆవిడ కనిపించిన దాఖలాలు చాలా అరుదు. అందులోనూ చెన్నైలోనే ఉండటంతో అదే పనిగా తెలుగు సినిమాలు చేయడం తక్కువగా ఉండేది.

చిరుతో నటించాలని తను ఎన్నేళ్ల నుంచో కలగా భావిస్తున్న కోరిక ఈ రూపంలో తీరిందన్న మాట. అంటే కాకా భార్యగా స్నేహను చూడబోతున్నామని అర్థం చేసుకోవచ్చు. ఇందులో చిరంజీవి పాత్ర వాల్తేర్ వీరయ్య లాగా రెగ్యులర్ షేడ్స్ లో హీరోయిన్ తో డాన్స్ చేసే తరహాలో ఉండదు. డాక్టర్ చదివే వయసున్న అనస్వర రాజన్ తండ్రిగా వయసుకు తగ్గట్టు డిజైన్ చేశారు బాబీ. ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కానీ అందులోనూ గ్లామర్ కోటింగ్ లాంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారట.

సో కొంచెం టైం పట్టినా మంచి ఆప్షనే అనుకోవాలి. దీనికి సంబంధించి కెవిఎన్ ప్రొడక్షన్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే. సంక్రాంతి విడుదలను టార్గెట్ గా చేసుకుని పరుగులు పెడుతున్న కాకాకు అనుకోకుండా విశ్వంభర రూపంలో స్పీడ్ బ్రేకర్ పడింది. అది కూడా పండక్కు వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడంతో చిరంజీవి ఏ నిర్ణయం తీసుకుంటారనే దాని మీద అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా వెయిట్ చేస్తోంది.

ఒకవేళ తప్పుకోవాల్సి వస్తే మటుకు కాకా 2027 వేసవికి వెళ్ళిపోతుంది. రెండింటి మధ్య కనీసం మూడు నాలుగు నెలలు గ్యాప్ ఉండటం సబబు కాబట్టి అలా చేయక తప్పదు. తమన్ సంగీతం సమకూరుస్తున్న కాకాలో అధిక భాగం కోల్కతా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. గ్యాంగ్ స్టర్ నేపధ్యమే అయినా ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ తో పాటు అభిమానులు కోరుకునే మాస్ అంశాలు అన్నీ పొందుపరిచినట్టు తెలిసింది. విడుదల తేదీ తేలడానికి ఇంకొంత సమయం పట్టొచ్చు.

This post was last modified on September 17, 2026 10:55 am

Share

Recent Posts

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

52 minutes ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

2 hours ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

2 hours ago

‘బ్రేకింగ్ బ్యాడ్’తో ‘జైలర్‌’కేం పని?

అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…

3 hours ago

గుంత కనిపిస్తే AI చూసుకుంటుంది

రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు చాలామంది చేస్తుంటారు. కానీ ఆ గుంతను బాగు…

3 hours ago

ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయం తీర్చాల్సిందే

ఫౌజీ వాయిదా పడింది. సంతోషం. ఇలాంటి పోస్టుపోన్లు చూడటం కొత్తేమి కాదు కాబట్టి అందులో ఫీలవ్వడానికి ఏం లేదు. మరి…

4 hours ago