Trends

ఫుట్ పాత్ లపై ట్రాన్స్ ఫార్మర్లేంది స్వామీ?

మన దేశంలో పాదచారుల కోసం రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ ల మీద బడ్డీ కొట్లు మొదలు…జ్యూస్ షాప్ వరకు..అబ్బో ఒకటేమిటీ ఓ మినీ ఈట్ స్ట్రీట్ ఉంటుంది. జనం కోసం జనం మధ్యలో వెలిసిన ఆ ఫుట్ పాట్ షాపులకు గిరాకీ కూడా బాగానే ఉంటుంది. ఇక, బెంగుళూరులో అయితే ఫుట్ పాత్ లను దూకుడులో బ్రహ్మానందాన్ని మహేష్ బాబు వాడినదాని కంటే దారుణంగా వాడేశారు. ఏకంగా ఫుట్ పాత్ లపై విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను పెట్టేశారు అక్కడి విద్యుత్ శాఖ అధికారులు. ఏదో ఒక చోట అర చోట అనుకుంటే మీరు పొరబడినట్లే.

కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ వందల కొద్దీ ట్రాన్స్ ఫార్మర్లు ఇంకా అలాగే ఉంచారు ఆ శాఖ అధికారులు. తాజాగా బెంగళూరులోని మెయిన్ రోడ్డులో ఉన్న అమెజాన్ ఆఫీస్ సమీపంలో ఫుట్ పాత్ పై ఓ ట్రాన్స్ ఫార్మర్ బాక్స్ పేలిన ఘటనలో ఇద్దరు గాయపడ్డ వైనం వార్తల్లో నిలిచింది. ఆ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బెంగుళూరు ఫుట్ పాత్ ల మీద వేలాది ట్రాన్స్‌ఫార్మర్లను బెంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. అయితే, ప్రజల భద్రతకు అవి తీవ్ర ముప్పుగా మారాయి. గతంలో కూడా ఎన్నో ఘోరమైన ప్రమాదాలు జరిగాయి. ఫుట్‌పాత్‌లపై ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించాలని, ఫుట్‌పాత్‌లను ఎలాంటి ఆక్రమణలు లేకుండా పూర్తిగా ఖాళీగా ఉంచాలని కర్ణాటక హైకోర్టు ఎన్నోసార్లు తీర్పునిచ్చింది. ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో ప్లాట్ ఫామ్, రోడ్లపై నడవాల్సి రావడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన ప్రాథమిక “జీవించే హక్కు”ను ఉల్లంఘించడమే అవుతుందని కోర్టు స్పష్టం చేసింది.

ఈ వ్యవహారంపై ఇప్పటికే ఎన్నో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కాగా ట్రాన్స్‌ఫార్మర్లన్నింటినీ ఫుట్‌పాత్‌ల నుండి తొలగించాలని కోర్టు పలుమార్లు ఆదేశించింది. అలా కుదరకపోతే ట్రాన్స్ ఫార్మ్ లను భూమి నుంచి కనీసం 7 అడుగుల ఎత్తులో ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకపోయింది. ఇక, ప్రైవేట్ ఆస్తిదారులు, అపార్ట్‌మెంట్ ల వారు తమ ట్రాన్స్‌ఫార్మర్లను ప్రజల నడిచే దారుల్లో కాకుండా తమ సొంత ఆవరణలోనే ఉంచుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి.

కోర్టు మొత్తుకోవడంతో కొద్ది సంవత్సరాలు వేలాది ట్రాన్స్‌ఫార్మర్లను ఫుట్ పాత్, రోడ్డుకు సమీపం నుంచి తరలించారు. అయినా సరే, ఇంకా చాలా పాత మోడల్ ట్రాన్స్‌ఫార్మర్ బాక్సులు ఇంకా చాలా చోట్ల బిజీగా ఉండే ఫుట్‌పాత్‌లపైనే కొనసాగుతూ పాదచారుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు వాటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

This post was last modified on October 7, 2026 5:50 pm

Share

Recent Posts

రేవంత్ ఫాంహౌస్ పాచిక పెద్దదే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ను నిశితంగా చూస్తే..ఆయనలో తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేసిన అధినేతల నీడలు కొట్టొచ్చినట్లు…

35 minutes ago

శివన్న ‘బెయిల్’కి ప్రేమ దెబ్బ పడింది

జైలర్ తో శివరాజ్ కుమార్ మనకూ దగ్గరయ్యారు. పెద్దిలో రామ్ చరణ్ గురువుగా నటించి దానికీ ప్లస్ అయ్యారు. గౌతమీపుత్ర…

1 hour ago

రంగస్థలం కాంబో… అసలు టార్గెట్ ఏంటి

పెద్దికి అంత కష్టపడినా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు…

3 hours ago

రికమండేషన్ లేకుండానే కార్యకర్తలకు పదవులు

ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…

3 hours ago

ఇప్పటి వరకు గెలుపులు… ఇకపై మలుపులు

నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…

3 hours ago

జిమ్ జిమ్ తార… కావాలనే వైరల్ చేసారా?

జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…

4 hours ago