రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు చాలామంది చేస్తుంటారు. కానీ ఆ గుంతను బాగు చేయాల్సింది ఎవరు? కంప్లైంట్ ఎవరికి పంపాలి? అనేది చాలామందికి తెలియదు. బెంగళూరుకు చెందిన 33 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గౌరవ్ సేన్ దీనికో పరిష్కారం తయారు చేశాడు. AI సాయంతో పనిచేసే ‘పాట్‌హోల్ రిపోర్టర్ (Pothole Reporter)’ అనే యాప్‌ను రూపొందించాడు.
బెంగళూరులో కొంతకాలంగా వాటర్, పైప్‌లైన్ పనుల కోసం చాలా చోట్ల రోడ్లను తవ్వుతున్నారు. పనులు పూర్తయిన తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు సరిగా లేకపోవడం, గుంతలు ఏర్పడటం కనిపిస్తోంది. గౌరవ్ కూడా ఇలాంటి రోడ్లపై ప్రయాణిస్తూ ఇబ్బంది పడ్డాడు. సిస్టమ్ డిజైన్, AIలో తనకున్న అనుభవంతో గుంతలను గుర్తించే యాప్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ యాప్ పని చేసే విధానం కూడా సింపుల్‌గానే ఉంటుంది. రోడ్డుపై దెబ్బతిన్న ప్రాంతాన్ని ఫొటో తీస్తే AI దాన్ని పరిశీలిస్తుంది. అక్కడ నిజంగా రోడ్డు దెబ్బతిందా? ఎంత పెద్ద సమస్య ఉంది? అనే వివరాలను గుర్తిస్తుంది. ‘డ్రైవ్’ మోడ్ ఉపయోగిస్తే వాహనం వెళ్తున్న సమయంలో రోడ్డును వరుసగా ఫొటోలు తీస్తూ గుంతలను గుర్తించేలా రూపొందించారు. ఇప్పటికే నమోదైన గుంత అయితే మ్యాప్‌లో కూడా చూపిస్తుంది.
ఆ రోడ్డు ఏ ప్రభుత్వ విభాగం పరిధిలోకి వస్తుందో కూడా తెలుసుకునేలా గౌరవ్ దీనిని రూపొందించాడు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు పంపేందుకు యాప్‌లోనే ఈమెయిల్ ఆప్షన్ ఉంటుంది. అంటే గుంత ఫొటో తీసిన తర్వాత ఏ ఆఫీసుకు వెళ్లాలి, ఎవరికి చెప్పాలి అని వెతకాల్సిన పని తగ్గుతుంది.
‘పాట్‌హోల్ రిపోర్టర్’ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను సెప్టెంబర్ 21న గూగుల్ ప్లే టెస్టింగ్ ట్రాక్‌లో విడుదల చేశారు. మొదట సుమారు 200 మంది టెస్టర్లతో దీనిని పరీక్షించారు. ఇప్పుడు ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. బెంగళూరులో మొదలైన ఈ ప్రయత్నం ఇంకా మరిన్ని రాష్ట్రాలకు అందిస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
This post was last modified on October 7, 2026 7:20 pm
ఫౌజీ వాయిదా పడింది. సంతోషం. ఇలాంటి పోస్టుపోన్లు చూడటం కొత్తేమి కాదు కాబట్టి అందులో ఫీలవ్వడానికి ఏం లేదు. మరి…
ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో వివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్…
మన దేశంలో పాదచారుల కోసం రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ ల మీద బడ్డీ కొట్లు మొదలు...జ్యూస్…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ను నిశితంగా చూస్తే..ఆయనలో తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేసిన అధినేతల నీడలు కొట్టొచ్చినట్లు…
జైలర్ తో శివరాజ్ కుమార్ మనకూ దగ్గరయ్యారు. పెద్దిలో రామ్ చరణ్ గురువుగా నటించి దానికీ ప్లస్ అయ్యారు. గౌతమీపుత్ర…
పెద్దికి అంత కష్టపడినా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు…