Trends

అప్పులు తీర్చడానికి గోదావరి ఒక్కటే మార్గమా?

అప్పులేని వాడు ధనవంతుడు కావచ్చు కానీ అప్పులు లేని ఒక్క ధనవంతుడు కూడా ఉండడు. మనదేశంలో అయితే అప్పులు చేసి విదేశాలకు పారిపోయిన బడా పారిశ్రామిక వేత్తల సంఖ్య చాంతాడంత లిస్టు వుంది. దేశంలోని బ్యాంకుల్లో అప్పులు చేసి ఉద్దేశ్య పూర్వకంగా ఎగవేసిన వారు 28,318 మంది వున్నారు. 2014 వరకు వీరు ఎగవేసిన సొమ్ము 39,369 కోట్లు కాగా ఇప్పుడది 3.89 లక్షల కోట్లకు చేరింది. వీరిలో ఒక్కడు కూడా ఆత్మహత్యలు చేసుకోలేదు. కనీసం ఆత్మహత్యాయత్నం కూడా చేయలేదు. వీదేశాలకు పారిపోయి దర్జాగా బతుకుతున్నారు.

కానీ… కొందరు మాత్రం చేసిన అప్పులు తీర్చలేక గోదాట్లో దూకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సకుటుంబ సమేతంగా మృత్యువును వరిస్తున్నారు. కని పెంచిన పిల్లలను సైతం కర్కషంగా గోదావరిలోకి నెట్టి వారితోపాటుగా తనువు చాలిస్తున్నారు. నిత్యం జరుగుతున్న ఇలాంటి ఘటనలు కలవరం కలిగిస్తున్నాయి. రాన్రాను ఇదొక సామాజిక సంక్షోభం లాగ మారిపోతుందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడా బ్రిడ్జి వద్ద తణుకుకు చెందిన కిరణా వ్యాపారి నంబూరు శ్రీనివాస్, పద్మిని దంపతులు 16 ఏళ్ళ కుమారుడు, 12 ఏళ్ళ కూతురితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్రీనివాస్, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. పద్మినిని అక్కడే వున్న జాలర్లు రక్షించారు. ఆపస్మారక స్థితిలో వున్న పద్మినిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స చేస్తున్నారు. వ్యాపారం సజావుగా సాగక పోవడంతో ఆర్ధిక సమస్యలు చుట్టు ముట్టాయి. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దీంతో దిక్కుతోచని శ్రీనివాస్ నిరాశకు గురయ్యారు.

గోదావరిలో దూకి ఆత్మహత్యలు చేసుకోవడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. పది రోజుల క్రితమే తణుకు మండలం వేల్పూరుకు చెందిన భార్యాభర్తలు గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఘటనలో భర్త మృతి చెందగా భార్య గల్లంతయ్యారు. రోజులు గడుస్తున్నా భార్య మృతదేహం లభ్యం కాలేదు. కారణం ఏమిటో తెలియదు.
కారణం ఏదైనా చావే పరిష్కారం కాదు.

కుటుంబ సమస్యలు, ఆర్ధిక కారణాలు, అనారోగ్యం పేరుతో తెలంగాణాలో రోజుకు 30 మంది, ఆంధ్రప్రదేశ్ లో 22 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో చెబుతుంది.
నిజానికి ఈ ఆత్మహత్యలకు కారణం ఆర్ధిక సమస్యలు అనడం కంటే మానసిక సమస్యలు అనడమే సరైందని సైకాలాజిస్టులు చెబుతున్నారు. అప్పులు చేసినప్పుడు తీర్చే మార్గం గురించి అలోచించాలి, గోదావరిలో దూకితే అప్పులు మాఫీ కావని వివరిస్తున్నారు. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం, వెనకంజ వేయకుండా ముందుకు సాగడం అవసరమని చెబుతున్నారు.

This post was last modified on September 8, 2026 1:08 pm

Share

Recent Posts

చిరు vs ఎన్టీఆర్ ఫాన్స్ వార్లు… సహించని హై కమాండ్లు

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న కూటమి పార్టీల్లో కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకుల మధ్య సోషల్ వార్ జరుగుతుంది.…

1 hour ago

ప్యారడైజ్ నిలబెట్టుకోవాల్సింది అదొక్కటే

వాయిదాల ప్రచారాలకు చెక్ పెడుతూ నిన్న ప్యారడైజ్ బృందం మరోసారి సెప్టెంబర్ 24 విడుదలని కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.…

1 hour ago

ప్యాన్ సౌత్ సినిమా… చాలా మంచి మాట ఇది

ప్యాన్ ఇండియా పేరుతో ప్రతి హీరో వరల్డ్ బిల్డింగ్, ఎలివేషన్ల వెనుక పడటంతో సినిమాల వేగం తగ్గిపోయింది. టయర్ 2,…

1 hour ago

డిల్లీ ఘటన.. హైదరాబాద్ లో కూడా ఓ లుక్కెయ్యాలి

ఢిల్లీలో ఏడుగురి ప్రాణాలు తీసిన సత్య నికేతన్ భవనం ఘటనలో ఒక విషయం ఎక్కువగా ఆలోచింపజేస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు…

2 hours ago

5 నెలల టికెట్ ఉన్నా… అమెరికాలో 2 నెలలే ఉండమన్నారు!

హైదరాబాద్‌కు చెందిన ఓ దంపతులు ఐదు నెలలు అమెరికాలో ఉండాలని ప్లాన్ చేసుకుని మయామీ వెళ్లారు. ఐదు నెలల తర్వాత…

3 hours ago

మోదీ ఈవెంట్‌కు కూడా బుక్‌మైషో టికెట్లా…

సినిమా చూడాలంటే బుక్‌మైషోలో టికెట్ తీసుకోవడం కామన్. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమానికి కూడా…

3 hours ago