Movie News

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేసింది. మొదటి మూడు నాలుగు రోజుల వసూళ్లు చూసి టాక్ తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టరవుతుందని డిస్ట్రిబ్యూటర్లు భావించారు. తీరా చూస్తే సోమవారం నుంచి సీన్ రివర్స్ అయ్యింది. మెయిన్ సెంటర్స్ లోనూ యాభై శాతం ఆక్యుపెన్సీలు లేక కలెక్షన్లు తగ్గిపోయిన వైనం నెంబర్ల సాక్షిగా కనిపిస్తోంది.

ఇంకో వీకెండ్ ముంచుకొస్తోంది. ఈ వారం అడ్వాంటేజ్ ఏమిటంటే గాంధీ జయంతి శుక్రవారం వచ్చింది. నేషనల్ హాలిడే కాబట్టి జనాలు థియేటర్ ఎంటర్ టైన్మెంట్ కు ప్రాధాన్యం ఇస్తారు. అలా అయితే స్కేల్ పరంగా ప్యారడైజ్ దే పై చేయి అవుతుంది. అయితే టాక్ ని పట్టించుకోకుండా నాని కోసం ఎంత శాతం ఆడియన్స్ వెళ్తారనే దాన్ని బట్టి పికప్ ఉంటుందా లేదానే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అమాంతం ఉండకపోయినా ఓ మోస్తరుగా ఉన్నా చాలు రికవరీ అవకాశాలు పెరుగుతాయి.

కాకపోతే అక్టోబర్ 2 టార్గెట్ చేసుకుని కొత్త సినిమాలు క్యూ కట్టాయి. రాజమౌళి ఫ్యామిలీ సపోర్ట్ తో వస్తున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ తో పాటు సందీప్ కిషన్ సిగ్మా, తెల్లకాగితం, ఎస్ఐ యుగంధర్, సంచారి, అనకాపల్లి అంటూ నాలుగైదు మీడియం, చిన్న బడ్జెట్ చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఇవేవి ప్యారడైజ్ కు సాటివచ్చేవి కాకపోయినా మరీ తక్కువంచనా వేయడానికి లేదు. మండాడి సక్సెస్ ని ఎవరు ఊహించారు. ఈజీగా వంద కోట్లు దాటేసింది.

నాని పబ్లిసిటీ ఆపే ఉద్దేశంలో లేడు. నిన్న సమ్మక్క సారక్క దర్శనం అయ్యాక ఇవాళ గుంటూరు, విజయవాడ ట్రిప్ వెళ్ళాడు. థియేటర్ విజిట్స్ చేయబోతున్నాడు. మాములుగా అయితే వీకెండ్ తర్వాత హీరోలు సైలెంట్ అయిపోతారు. కానీ నాని అలా కాదు. వీక్ గా ఉన్న ఏరియాలు ఏవో కనుక్కుని మరీ వెళ్తున్నాడు. జనాల పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జాతీయ సెలవు దినం కలిసి వస్తున్న ఈ స్పెషల్ వీకెండ్ ని ఏ మేరకు వాడుకుంటాడో నెంబర్లు వచ్చాక తెలుస్తుంది.

This post was last modified on September 30, 2026 12:09 pm

Share

Recent Posts

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

10 minutes ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

1 hour ago

రాజమౌళి చెప్పిన ఈ ఫార్ములా ఫాలో అయితే?

రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…

1 hour ago

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

2 hours ago

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

2 hours ago

పార్టీ క‌న్నా ప‌రువు కాపాడుకునేదెలా…

కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…

2 hours ago