ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీట్ల సర్దుబాటు విషయంలో జనసేన నాయకుల కోరికలకు కూటమి పెద్ద టీడీపీ గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా ? అన్నది డౌట్‌గానే మారింది. గత ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లలోనే పోటీ చేసింది. ఈ సీట్లలో నూటికి నూరుశాతం విజయాలు నమోదు చేసింది. అయితే ఈ సారి మున్సిపల్, కార్పొరేషన్లలో మాత్రం అంతకుమించిన సీట్లను కోరుకుంటోంది. గత ఎన్నికల్లో జగన్‌ను గద్దె దింపేందుకు, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు తాము చాలా త్యాగాలు చేశామని.. ఈ సారి త్యాగాలకు తాము సిద్ధంగా లేమని.. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి తాము మరింత బలపడ్డామని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు.
అందుకే ఆ పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ తమకు పట్టున్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తామంటూ ప్రకటన చేశారు. మనోహర్ చేసిన కామెంట్లు లోకేష్ చేసిన 15 % కు కౌంటర్‌గానే ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో త్యాగాలకు సిద్ధమైన జనసేన ఈ సారి మాత్రం టీడీపీపై అవసరం అయితే ఒత్తిడి చేసి మరీ ఎక్కువ సీట్లు సాధించుకోవాలన్న పంతంతో ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఈ సారి మేయర్, జడ్పీచైర్మన్, మునిసిపల్ చైర్మన్ పదవులు ఆశిస్తున్నారు.
ఇక జనసేనలో వీరమహిళలు సైతం తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీ కోసం కష్టపడిన వారికి కనీసం స్థానిక ఎన్నికల్లో అయినా న్యాయం చేయకపోతే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ కోసం కష్టపడేందుకు ఎవ్వరూ ముందుకు రారన్న భావనలో పార్టీ కీలక నేతలు ఉన్నారు. ఈ క్రమంలోనే ఏపీలో కీలకమైన ఐదు కార్పొరేషన్లలో తాము పోటీ చేస్తామని జనసేన చెపుతోంది. విజయవాడ, కాకినాడ, తిరుపతి, ఒంగోలు, ఏలూరు కార్పొరేషన్లనలో మేయర్ పదవిని జనసేన కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పదహారు కార్పొరేషన్లలో ఐదు కార్పొరేషన్లు అంటే చాలా ఎక్కువే అన్నది టీడీపీ వెర్షన్.
జనసేన కోరుతోన్న కార్పొరేషన్లలో విజయవాడ ఇచ్చేందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేయదు. ఏలూరు విషయంలో జనసేన గట్టిగా పట్టుబడుతోంది. తిరుపతి విషయంలో గత శాసనసభ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం జనసేనకు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ జనసేనకే మేయర్ ఇస్తారా ? అన్నది చూడాలి. అలాగే ఒంగోలు జనసేన కోరుతున్నా.. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే జనార్థన్, జనసేనలో ఉన్న మాజీ మంత్రి బాలినేని మధ్య వార్‌తో జనార్థన్ ఒంగోలు మేయర్ జనసేనకు ఇచ్చేందుకు అస్సలు ఇష్టపడట్లేదు.
ఇక ఉత్తరాంధ్రలోని విజయనగరంతో పాటు రాయలసీమలో ఒక కార్పొరేషన్‌తో పాటు కాకినాడ మేయర్ పదవులు జనసేనకు ఇవ్వవచ్చని టీడీపీలో టాక్ నడుస్తోంది. మరి జనసేన కోరికలు చంద్రబాబు ఎంత వరకు తీరుస్తారు ? జనసేనకు ఏయే మేయర్ పదవులు దక్కుతాయో ? చూడాలి.
This post was last modified on September 5, 2026 8:27 am
ఒకప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుండేవాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. కానీ రోడ్డు ప్రమాదం తర్వాత తన కెరీర్…
ది ప్యారడైజ్ సినిమాకు సోషల్ మీడియాలో వచ్చిన స్పందన, ట్రోలింగ్ గురించి నాని రెండో రోజే ఓపెన్ అయిపోవడం అందరినీ…
ది ప్యారడైజ్ సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో కానీ.. ఈ సినిమాకు వచ్చిన హైప్, దీనికి జరిగిన అడ్వాన్స్…
ఎమ్మెల్యేలు రెండు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తేనెతెట్టును కదిపారు. దాంతో ఇప్పుడు కర్ణాటకలో రెండు పెళ్లిళ్లు…
వైసీపీ అధినేత జగన్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతర పార్టీలతో ఎప్పుడూ పొత్తులు పెట్టుకోలేదు. ఎన్నికల్లో…
మెగాస్టార్ చిరంజీవి ఏ ఈవెంట్‌కు హాజరైనా తనదైన శైలిలో పంచులు వేస్తూ.. హుషారుగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. తెర మీదే…