కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం ఇట్లాంటి ఆలోచన చేస్తారు. ఎందుకంటే పార్టీ ద్వారానే వారు ముందు ముందు ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీకి ప్రాధాన్యం ఇస్తారు. కానీ, కొంతమంది సీనియర్ నాయకుల విషయంలో మాత్రం దీనికి భిన్నమైన వాదన స్పష్టంగా వినిపిస్తుంది. పార్టీ కన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది నాయకుల ప్రభావం ఆ పార్టీలపై ఉంటుంది. ఇలాంటి వారిలో బొత్స సత్యనారాయణ ఒకరు.
కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకును సంపాదించుకున్నారు. తనకంటూ ప్రత్యేక ప్రభావాన్ని కూడా సొంతం చేసుకున్నారు. తన వర్గాన్ని డెవలప్ చేసుకున్నారు. అయితే అది తర్వాత కాలంలో వ్యక్తిగతంగా ఆయనకు, ఆయనతో పాటు ఉన్న పార్టీలకు కూడా ఉపయోగపడింది. ఇదే 2019 లో వైసీపీకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కలిసి వచ్చిన అంశం అని చెప్పక తప్పదు. కొంతమంది నాయకుల ప్రభావం వైసీపీని అనూహ్య స్థాయిలో విజయం దిశగా నడిపించింది. ఇటు పార్టీ పరంగా ఉన్న ఇమేజ్ కు వ్యక్తిగతంగా నాయకులకు ఉన్న ఇమేజ్ కూడా తోడైన కారణంగా వైసిపికి 2019 ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ కనిపించింది.
అధికారంలోకి రావడానికి అవకాశం కల్పించింది. కానీ, ఇప్పుడు అదే నాయకులు మైనస్ అయ్యే పరిస్థితి పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. పార్టీ కంటే కూడా వ్యక్తిగతంగా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఈ దిశగానే ఆలోచన చేస్తున్నారు. తన ఇమేజ్ దెబ్బతింటోంది.. అదే సమయంలో తన ఓటు బ్యాంకు కూడా తగ్గిపోతోంది.. అనేది ఆయన ఆవేదన. ఇటీవల ఆయన సొంత మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు టిడిపిలోకి వెళ్లిపోవడం అనంతర పరిణామాల్లో చీపురుపల్లి నియోజకవర్గంలో భారీ ఎత్తున వైసిపి నాయకులు, కార్యకర్తలు మండల స్థాయి నేతలు కూడా వైసీపీకి రాజీనామా చేయడం వంటివి పార్టీ కంటే కూడా సత్యనారాయణ వ్యక్తిగత రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుందన్నది మేధావులు అంచనా వేస్తున్నారు.
ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ కూడా అంగీకరిస్తున్నారు. ఎందుకంటే ఒక పార్టీ కంటే కూడా సత్యనారాయణ వ్యక్తిగతంగా సంపాదించుకున్న ఓటు బ్యాంకు చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు అది చెదిరిపోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీ కంటే కూడా ఆయన తన వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకునేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ, మరోవైపు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. మానసికంగా ఆవేదంలో ఉన్నారు. దీంతో తన వారసురాలిగా అనూషను ప్రకటించారు. వేదికపై కూడా ఎక్కించారు.
అయితే ఆమె ప్రభావం అంతగా కనిపించడం లేదన్నది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఈ కారణంగా కూడా బొత్స వ్యక్తిగత రాజకీయాలు దాదాపు ప్రభావం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి పార్టీ కన్నా పరువు కాపాడుకునే విషయంలో బొత్స సత్యనారాయణ ఏ విధంగా అడుగులు వేస్తారు.. ఏ విధంగా ముందుకు సాగుతారు అనేది చూడాలి.
This post was last modified on September 30, 2026 10:06 am
సైబర్ నేరాల గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు సహా రిజర్వ్ బ్యాంకు…
చాలా ఏళ్ల నుంచి తమిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒకడు. సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్ తర్వాత…
తెలంగాణలో కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, డిప్యూటీసీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ల జోడీకి ప్రజల్లో మరింత ఆదరణ…
మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…
ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…