ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి. ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు, మరోవైపు ఖైరతాబాద్ అసెంబ్లీ ఎన్నికల తయారీతో ప్రధాన రాజకీయ పార్టీలు బిజీ బిజీగా వున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎలాగైనా సరే తమ స్థానాన్ని నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీ ఉనికి చాటుకునే ప్రయత్నంలో వుంది. మధ్యలో కొత్త పార్టీలు కవిత టీఆర్ఎస్, పవన్ కళ్యాణ్ జనసేన కూడా రంగంలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో ఖైరతాబాద్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ ఆ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరడం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీ ఫాం మీద పోటీ చేయడంతో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కోర్టుకు వెళ్లారు. దాంతో దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి వేటు వేస్తూ హై కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పై సుప్రీం కోర్టుకు వెళ్లిన ఫలితం లేకుండా పోయింది. దాంతో ఖైరతాబాద్ అసెంబ్లీకి ఎన్నికలు అనివార్యం అయిపొయింది. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా నాగేందర్ మళ్ళీ పోటీ చేయడం ఖాయం. మిగిలిన పార్టీలు కూడా బలమైన అభ్యర్థులతో తలపడేందుకు సిద్ధం అవుతున్నాయి.
ఇప్పటికే ఖైరతాబాద్ నుంచి టీఆర్ఎస్ కూడా పోటీ చేస్తుందని కవిత ప్రకటించారు. ఇప్పుడు తాజాగా జనసేన కూడా పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఐదు పార్టీల మధ్య హోరా హోరి పోరు జరిగే అవకాశం వుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన పోటీ చేస్తోంది. ఇప్పుడు ఖైరతాబాద్ నుంచి పోటీకి దిగుతుంది. ఈ ఎన్నికలతో తెలంగాణాలో జనసేన బలంగా పునాదులు వేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. అలాగని ఖైరతాబాద్ నుంచి నామ మాత్రంగా పోటీ చేసే ఆలోచన చేయడం లేదు. అంగబలం, ఆర్ధిక బలం కలిగిన అభ్యర్థిని పోటీకి దించుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీజేపీ మధ్య పొత్తు వుంది. అయితే తెలంగాణాలో ఎవరికి వారు పోటీ చేస్తున్నారు. దీంతో బీజేపీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలే తెలంగాణాలో బీజేపీ జాతకం బాగా లేదు. ఇప్పుడు జనసేన ఎంట్రీతో కమలం కమిలి పోవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ తో బీఆర్ఎస్, జనసేనతో బీజేపీ నష్టపోతే మధ్యలో కాంగ్రెస్ గట్టేక్కడం ఖాయమని భావిస్తున్నారు.
This post was last modified on September 30, 2026 10:29 am
ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…
ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…
కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…
సైబర్ నేరాల గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు సహా రిజర్వ్ బ్యాంకు…
చాలా ఏళ్ల నుంచి తమిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒకడు. సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్ తర్వాత…
తెలంగాణలో కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల…