ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మనం ఫాలో కాని అకౌంట్ల నుంచి కూడా వరుసగా రీల్స్ వచ్చేస్తుంటాయి. ఒక వీడియో కాస్త ఎక్కువసేపు చూస్తే చాలు, అదే తరహా వీడియోలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. ఇదంతా అల్గారిథమ్ చేసే పని. ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ సిస్టమ్‌లోనే ఒక పెద్ద మార్పు తీసుకురావాలని చూస్తోంది. అల్గారిథమ్ ఆధారంగా వచ్చే ఫీడ్ వద్దనుకునే యూజర్లకు దాన్ని ఆఫ్ చేసే అవకాశం ఇవ్వాలని కొత్త చట్టాన్ని ప్రతిపాదిస్తోంది.
ఈ ప్లాన్ అమల్లోకి వస్తే సోషల్ మీడియా యాప్స్ యూజర్లకు అప్పుడప్పుడు ఒక పాప్ అప్ చూపించాల్సి ఉంటుంది. అల్గారిథమ్ నిర్ణయించే కంటెంట్ చూడాలా? లేక తాము ఫాలో అవుతున్న వాళ్లు పెట్టే పోస్టులు మాత్రమే చూడాలా? అనే ఆప్షన్ అందులో ఉంటుంది. అంటే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్ లాంటి ప్లాట్‌ఫామ్స్ మనకు ఏం చూపించాలో పూర్తిగా వాటంతట అవే నిర్ణయించే పరిస్థితిని తగ్గించాలన్నది ఆలోచన.
దీనితో పాటు సోషల్ మీడియా కంపెనీలపై మరిన్ని బాధ్యతలు పెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. హానికరమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను గుర్తించి తగ్గించాల్సిన బాధ్యత కంపెనీలదే అవుతుంది. ముఖ్యంగా 18 ఏళ్లలోపు పిల్లలకు బాడీ ఇమేజ్, అవమానించే లాంటి కంటెంట్ విషయంలో మరింత కఠినమైన నిబంధనలు ఉండొచ్చు. రూల్స్ పాటించని కంపెనీలకు 100 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లకు పైగా జరిమానా విధించే అవకాశం కూడా ప్రతిపాదనలో ఉంది.
ఇలాంటి ఆప్షన్ భారత్‌లో కూడా వస్తే మాత్రం సోషల్ మీడియా వాడే విధానంలో పెద్ద తేడా రావచ్చు. ప్రస్తుతం ఒక రీల్ నుంచి మరో రీల్‌కు తీసుకెళ్లేది ఎక్కువగా అల్గారిథమే. అది వద్దని చెప్పి, మనం ఫాలో అయ్యే వాళ్ల కంటెంట్ మాత్రమే చూసే అవకాశం వస్తే ఫీడ్‌పై యూజర్‌కు ఇప్పటికంటే ఎక్కువ కంట్రోల్ దక్కుతుంది.
This post was last modified on September 8, 2026 10:50 am
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న కూటమి పార్టీల్లో కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకుల మధ్య సోషల్ వార్ జరుగుతుంది.…
వాయిదాల ప్రచారాలకు చెక్ పెడుతూ నిన్న ప్యారడైజ్ బృందం మరోసారి సెప్టెంబర్ 24 విడుదలని కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.…
ప్యాన్ ఇండియా పేరుతో ప్రతి హీరో వరల్డ్ బిల్డింగ్, ఎలివేషన్ల వెనుక పడటంతో సినిమాల వేగం తగ్గిపోయింది. టయర్ 2,…
ఢిల్లీలో ఏడుగురి ప్రాణాలు తీసిన సత్య నికేతన్ భవనం ఘటనలో ఒక విషయం ఎక్కువగా ఆలోచింపజేస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు…
హైదరాబాద్‌కు చెందిన ఓ దంపతులు ఐదు నెలలు అమెరికాలో ఉండాలని ప్లాన్ చేసుకుని మయామీ వెళ్లారు. ఐదు నెలల తర్వాత…
సినిమా చూడాలంటే బుక్‌మైషోలో టికెట్ తీసుకోవడం కామన్. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమానికి కూడా…