Movie News

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్ విశేషాలను తెలుసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ‘మగధీర’తో తెలుగు సినిమాను ఎన్నో మెట్లు ఎక్కించిన రాజమౌళి.. అప్పట్నుంచో తాను తీసే భారీ చిత్రాలకు సంబంధించి మేకింగ్ వీడియోలు తీయించడం అలవాటు చేసుకున్నాడు.

మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్.. వీటి మేకింగ్ వీడియోలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టకున్నాయి. ఐతే రాజమౌళి సినిమాలంటే వాటి స్థాయి వేరు. వాటి ఫలితాలు వేరు. కాబట్టి ప్రేక్షకులు వాటి పట్ల అదే స్థాయిలో ఆసక్తి ప్రదర్శిస్తారు. వేరే సినిమాల విషయంలోనూ అంత ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా అన్నది చెప్పలేం.

కానీ ‘రణబాలి’ టీం తమ సినిమా మీద ఎంతో కాన్ఫిడెన్స్‌తో రాజమౌళి రూట్‌ను ఫాలో అయిపోతోంది. ఈ సినిమా మేకింగ్ మీద ఒక భారీ డాక్యుమెంటరీ తీసింది టీం. అది ఏకంగా నాలుగు సిరీస్‌లుగా రాబోతోందట. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమా రేంజికి డాక్యుమెంటరీ తీయడమే ఆశ్చర్యమంటే.. అది నాలుగు సిరీస్‌లుగా వస్తుందని ప్రకటించడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా మేకింగ్‌లో అన్ని విశేషాలున్నాయా.. సినిమా బాక్సాఫీస్ దగ్గర అంత అద్భుతం చేస్తుందని టీం నమ్ముతోందా.. ఈ చిత్రానికి అంతుందా అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

ఐతే రాహుల్ సంకృత్యన్ సామాన్యుడైన దర్శకుడేమీ కాదు. ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో తనేంటో చూపించాడు. ముఖ్యంగా ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను అతను డీల్ చేసిన విధానం తనపై అంచనాలు పెంచింది. ‘రణబాలి’ మీద మైత్రి సంస్థ విజయ్ మార్కెట్ స్థాయికి మించి భారీగా ఖర్చు పెట్టింది.

ఈ సినిమా ప్రోమోలు కూడా ప్రత్యేకమైన సినిమా చూడబోతున్న సంకేతాలు కనిపించాయి. మరి సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండి బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితం అందుకుంటుందా అన్నది చూడాలి. అది జరిగితేనే ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. రిజల్ట్ తేడా కొడితే మాత్రం ఈ సినిమాకు మళ్లీ డాక్యుమెంటరీనా అనే కౌంటర్లు పడతాయి.

This post was last modified on September 27, 2026 2:54 pm

Share

Recent Posts

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

8 minutes ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

49 minutes ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

2 hours ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

3 hours ago

ఏఐతో 100 కోట్ల ప్రాణాలకు ముప్పు?

సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…

3 hours ago

కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…

4 hours ago