స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి కీలకంగా మారిన మూడు మునిసిపల్ కార్పొరేషన్ల వ్యవహారం.. ఆసక్తిగా మారింది. రాజకీయ వర్గాల్లోనే కాదు.. కూటమి పార్టీల మధ్య కూడా ఈ మూడు కార్పొరేషన్ల చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. అవే.. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి. మూడు కార్పొరేషన్ల పరిధిలో జనసేన ప్రాబల్యం ఉండడంతో ఇవి తమకు ఇవ్వాలన్నది జనసేన నాయకులు కోరుతున్న మాట. కానీ.. ఇవే కార్పొరేషన్లలో టీడీపీకి కూడా బలమైన కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. దీంతో ఈ మూడు తమకే కావాలన్నది టీడీపీ నేతల పట్టు. మొత్తంగా ఈ మూడు కార్పొరేషన్ల వ్యవహారంపై కూటమిలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
విశాఖ: గ్రేటర్ విశాఖపట్నం పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ విజయం దక్కించుకుంది. ఒక్క విశాఖ దక్షిణ నియోజకవర్గం లో మాత్రం గత ఎన్నికల్లో జనసేన విజయం సాధించింది. అలాగే ఉత్తర నియోజకవర్గాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మిగిలిన వాటిలో టీడీపీ పాగా వేసింది. మరీ ముఖ్యంగా పార్లమెంటు స్థానం కూడా టీడీపీలోనే ఉంది. దీంతో ఇక్కడ జనసేన విశాఖ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కోరుతోంది. కానీ, టీడీపీ నాయకులు మాత్రం ఆ ఒక్కటి తప్ప.. అని అంటున్నారు.
విజయవాడ: విజయవాడలో జనసేనకు ఎవరూ ప్రజాప్రతినిధులు లేరు. కానీ,కాపు సామాజిక వర్గం బలం మాత్రం ఆపార్టీకే ఉంది. దీంతో విజయవాడ మేయర్ పీఠాన్ని తమకు ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా సైతం మేయర్ పీఠాన్ని తమ కుమారుడికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్‌లకు తమ కుమారుడిని పరిచయం చేయడంతోపాటు.. బయోడేటా కూడా అందించారు. కానీ, కాపులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సీటు తమకే ఇవ్వాలని జనసేన కోరుతోంది.
తిరుపతి: అసెంబ్లీ పరిదిలో జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. దీనికి తోడు జనసేన నాయకులు కిరణ్ రాయల్ వంటివారు కూడా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. దీంతో తిరుపతి నగర పాలక సంస్థ చైర్మన్ పోస్టుపై జనసేన నాయకులు ఆశలు పెట్టుకున్నారు. కానీ.. టీడీపీ నాయకులు కూడా ఇదే పట్టుబడుతున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ను త్యాగం చేశామని.. ఇప్పుడు చైర్మన్ సీటును వదులుకునే ది లేదని వారు చెబుతున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య చైర్మన్ సీటు వ్యవహారం.. ఆసక్తిగా మారింది. ఈ మూడు పక్కన పెడితే.. మిగిలి వాటిలో కొంత మేరకు సర్దుబాటు ధోరణి కనిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on September 26, 2026 11:29 am
సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…
ఒక పార్టీపై చర్యలు తీసుకున్నా.. ఒక పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకున్నా.. సహజంగానే ప్రజల్లో అంతో ఇంతో సింపతీ దక్కుతుంది.…
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజకీయాలు కూటమిలోనే అంతర్గత వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజకవర్గం పూర్తిగా పట్టణ పరిధిలో ఉంది.…
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…