వినాయక చవితిని అత్యంత ఘనంగా జరిపే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటాయి. చవితి వచ్చిందంటే పది రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ సంబరాలు మిన్నంటుతాయి. నవరాత్రి ఉత్సవాలతో ప్రతి వీధీ మోతెక్కిపోతుంది. ఇక నిమజ్జనం రోజైతే సందడి వేరే లెవెల్లో ఉంటుందనే చెప్పాలి. ముఖ్యంగా హైదరాబాద్‌లో వరల్డ్ ఫేమస్ ఖైరతాబాద్ గణేష్‌ను నిమజ్జనం చేస్తుంటే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ ఊగిపోతాయి.
గణపయ్య ఊరేగింపు సందర్భంగా యువత చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఆ జోష్ చూస్తే.. ఎవ్వరికైనా డ్యాన్స్ వేయాలి అనిపిస్తుంది. ఆటోమేటిగ్గా పాదం కదుపుతారు. అందుకు తాము కూడా మినహాయింపు కాదు అని రుజువు చేశారు పోలీస్ వాళ్లు.
శుక్రవారం ఖైరతాబాద్ గణేశ్‌ను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తున్న సమయంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. డీజే సౌండ్ మిన్నంటిన ఆ సందర్భంలో పోలీస్ వాళ్లు కూడా లోకం మరిచిపోయి నృత్యం చేశారు. పెద్ద ఎత్తున ఖాకీలు ఒకచోట గుమిగూడి స్టెప్పులు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చాలామంది దీన్ని పాజిటివ్‌గానే చూస్తున్నారు. ఖైరతాబాద్ గణపయ్యా మజాకా అని కామెంట్లు చేస్తున్నారు. ఈ దృశ్యం చూడముచ్చటగా ఉందంటున్నారు. కానీ అదే సమయంలో కొన్ని నెగెటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయి. తొక్కిసలాట, గొడవలు జరిగే సమయంలో జనాలను అదుపు చేస్తూ, జాగ్రత్తగా విధులు నిర్వర్తించాల్సింది పోయి.. ఇలా పోలీసులు గుంపులు కట్టి డ్యాన్సులు చేయడం కరెక్టా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on September 26, 2026 4:20 pm
అనంతపురం జిల్లా అంటేనే రాజకీయాలకు ముఖ్యంగా ఫైర్ పాలిటిక్స్‌కు కేంద్రం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ ఈ జిల్లా…
బయోపిక్ ట్రెండ్ మళ్ళీ మొదలైపోయింది. మహానటి సావిత్రి టైంలో ఈ జానర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ సిరీస్…
జైలర్ 2 సక్సెస్ తర్వాత సోషల్ మీడియా యువతకు ఒక పెద్ద సందేహం వస్తోంది. మన సీనియర్లు కూడా ఇలా…
ఎన్నికల సమయంలో ఓటుకు నోటు ఇవ్వడం చట్టపరంగా నేరం. కానీ, మన దేశంలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఆ చట్టం…
‘ఇండియన్’ లాంటి ఆల్ టైం కల్ట్ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ తీసి గట్టిగానే తల బొప్పి కట్టించుకున్నారు శంకర్,…
కడపజిల్లా మైదుకూరులో ఈ నెల 28న జరగాల్సిన స్థానిక ఎన్నికలపై ఎన్నికల సంఘం స్టే విధించింది. దీనిని రద్దు చేస్తున్నట్టు…