నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటున్నారు. వచ్చిన వాళ్ళను కలుస్తూ, క్షేమ సమాచారాలు చెబుతున్నప్పటికీ షూటింగ్ కు వచ్చి యాక్టివ్ గా యాక్షన్ సన్నివేశాలలో పాల్గొంటారా లేదానే దాని మీద అభిమానుల ఆందోళన ఇంకా తగ్గలేదు. డిసెంబర్ 25 దాదా రిలీజ్ అయినా కాకపోయినా ముందైతే హీరో సంపూర్ణంగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా బాలకృష్ణ ఇంకో రెండు వారాల్లో సెట్స్ లో అడుగు పెట్టొచ్చని టాక్. ఆయనతో తీయాల్సిన పెండింగ్ సన్నివేశాలు, ఎపిసోడ్స్ మాత్రమే బ్యాలన్స్ ఉంచేసి మిగిలినవి చకచకా పూర్తి చేస్తున్నారట. రిలీజ్ డేట్ ఒత్తిడి తీసుకోకుండా ముందు చిత్రీకరణ సాఫీగా జరిగే దాని మీద దృష్టి పెట్టినట్టు సమాచారం. సెప్టెంబర్ మినహాయిస్తే చేతిలో 85 రోజులు మాత్రమే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్, ఈవెంట్స్ అన్నీ ఈ వ్యవధిలోనే అయిపోవాలి.
నిర్మాత వెంకట సతీష్ కిలారు దానికి అనుగుణంగానే అంతా సిద్ధం చేసి పెట్టారట. ఒకవేళ విడుదల ఆప్షన్ మార్చుకోవాల్సి వస్తే సంక్రాంతి మంచి సీజన్ అవుతుంది కానీ ఇప్పటికీ విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో అసలా ఆలోచనే చేయడం లేదట. ఇటీవలే బాలయ్యని కలిసిన గోపీచంద్ మలినేని షెడ్యూల్స్ గురించి కూలంకుషంగా చర్చించి వచ్చారట. ఎన్ని రోజులు కావాలి, వీలైనన్ని తక్కువ డేస్ లో ఎలా పూర్తి చేయాలనే దాని మీద కసరత్తు చేస్తున్నారట.
వీరసింహారెడ్డి కాంబినేషన్ కావడంతో దాదా మీద ఫ్యాన్స్ ప్రత్యేక అంచనాలు పెట్టుకున్నారు. గత ఏడాది అఖండ 2 తాండవం షాక్ ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ దాదాతో హిట్ ట్రాక్ మొదలవుతుందని ఎదురు చూస్తున్నారు. తమన్ మరోసారి అదిరిపోయే ఆల్బమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తుండగా శరత్ కుమార్, శ్వాసిక, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర తారాగణం.
This post was last modified on September 27, 2026 4:12 pm
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి కీలకంగా మారిన మూడు మునిసిపల్ కార్పొరేషన్ల వ్యవహారం.. ఆసక్తిగా మారింది. రాజకీయ వర్గాల్లోనే కాదు..…
సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…
ఒక పార్టీపై చర్యలు తీసుకున్నా.. ఒక పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకున్నా.. సహజంగానే ప్రజల్లో అంతో ఇంతో సింపతీ దక్కుతుంది.…
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజకీయాలు కూటమిలోనే అంతర్గత వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజకవర్గం పూర్తిగా పట్టణ పరిధిలో ఉంది.…