Movie News

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా అంటే.. వాయిదా పడాల్సిందే. ఐతే ఒకసారి వాయిదా వేశాక మార్చిన డేటుకైనా సినిమాను రిలీజ్ చేస్తారా అంటే అదీ సందేహమే. మళ్లీ డేట్ మారిపోతూ ఉంటుంది. ఇంత టైం తీసుకున్నాక కూడా.. చివరి నిమిషంలో హడావుడి తప్పదు. ‘ది ప్యారడైజ్’ సినిమా విషయంలో ఏం జరిగిందో అంతా చూశాం. ట్రైలర్ రిలీజ్ చేయడానికి కూడా టైం లేక రేయింబవళ్లు పని చేస్తే కానీ.. ముందు రోజుకు కంటెంట్ డెలివర్ చేయలేకపోయారు.

ఐతే ‘ది ప్యారడైజ్’ వచ్చిన మూడు వారాలకు రాబోతున్న విజయ్ దేవరకొండ సినిమా ‘రణబాలి’ విషయంలో మాత్రం టీం పక్కా ప్లానింగ్‌తోనే అడుగులు వేస్తోంది. సెప్టెంబరు 11నే ఈ చిత్రం రావాల్సింది కానీ.. హీరోయిన్ రష్మిక మందన్నా గాయపడడంతో సినిమా వాయిదా పడింది. కానీ కొత్త రిలీజ్ డేట్ అక్టోబరు 16 విషయంలో మాత్రం సందేహాలు ఏమీ అక్కర్లేదని అంటున్నాడు దర్శకుడు రాహుల్ సంకృత్యన్.

ఈ సినిమా ఫస్ట్ కాపీని అక్టోబరు 10 కల్లా రెడీ చేసి, కంటెంట్ డెలివర్ చేసేస్తామని ధీమా వ్యక్తం చేశాడు రాహుల్. ఈ సినిమాకు ప్రి ప్రొడక్షనే సంవత్సరం పాటు చేశామని.. షూటింగ్ మొదలుపెట్టాక కూడా పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేశామని అతను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ఫస్టాఫ్ షూట్ పూర్తి కాగానే.. దానికి పోస్ట్ ప్రొడక్షన్‌ మొదలైపోయిందని.. అలాగే పెద్ద ఎత్తున వీఎఫెక్స్ ఉండడంతో ఆరు నెలల ముందే ఆ పని మొదలైందని.. షూట్‌తో సమాంతరంగా ఆ వర్క్ జరుగుతోందని రాహుల్ తెలిపాడు. విడుదలకు కొన్ని వారాల ముందే చిత్రీకరణ పూర్తయిందని.. ప్రస్తుతం డబ్బింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని రాహుల్ తెలిపాడు.

అన్నీ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయని.. ఏ హడావుడి లేకుండా విడుదలకు కొన్ని రోజుల ముందే ఫస్ట్ కాపీ వచ్చేస్తుందని చెప్పాడు రాహుల్. ఈ సినిమాలో 16 నిమిషాల వార్ సీక్వెన్స్ హైలైట్‌ అని.. అందులో సీజీ వర్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని అతను చెప్పాడు. దర్శకులకు షూట్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల విషయంలో క్లారిటీ ఉండాలని.. షూట్ త్వరగా పూర్తి చేసి, విడుదలకు ముందు హడావుడి పడకుండా ముందే ఫస్ట్ కాపీ తీయాల్సిన అవసరముందని సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున చేసిన సూచనను ‘రణబాలి’ టీం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలా అందరూ చేస్తే నిర్మాతలకు టెన్షన్ తప్పుతుంది.

This post was last modified on September 27, 2026 2:50 pm

Share

Recent Posts

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

44 minutes ago

ఏఐతో 100 కోట్ల ప్రాణాలకు ముప్పు?

సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…

45 minutes ago

కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…

2 hours ago

ఉన్న కాస్త సింపతీ పోతుంది జగన్

ఒక పార్టీపై చ‌ర్య‌లు తీసుకున్నా.. ఒక పార్టీ నాయ‌కుడిపై చ‌ర్య‌లు తీసుకున్నా.. స‌హ‌జంగానే ప్ర‌జ‌ల్లో అంతో ఇంతో సింప‌తీ ద‌క్కుతుంది.…

3 hours ago

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ రాజ‌కీయం మామూలుగా లేదే.. !

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజ‌కీయాలు కూట‌మిలోనే అంత‌ర్గ‌త వివాదాల‌కు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉంది.…

4 hours ago

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

9 hours ago