Political News

కేసీఆర్ ఫాం హౌస్ దగ్గర హై టెన్షన్

తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాతా మధును పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ ఆ వ్యవహారం సద్దుమణగలేదు. ఈ క్రమంలోనే తాతా మధు వ్యాఖ్యలకు నిరసనగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ ను ముట్టడించేందుకు కాంగ్రెస్ ఎస్సీ సెల్ పిలుపునిచ్చింది. 1000 డప్పులతో కేసీఆర్ ఫాం హౌస్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫాం హౌస్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డారు. ఎర్రవెల్లి పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

ఫామ్‌హౌస్ వైపు వెళ్లే అన్ని ప్రధాన రహదారులను బారికేడ్లతో దిగ్బంధించి పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు, ఎర్రవెల్లిలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ధర్నా శిబిరాన్ని పోలీసులు బలవంతంగా ఎత్తివేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల సవాళ్లతో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలలో పాల్గొంటున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎర్రవల్లి ఫాంహౌస్‌కు బయలుదేరారు.

కేసీఆర్ నివాసానికి వెళ్తున్న కేటీఆర్, హరీశ్ రావు వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, కాలినడకన వారు ఫాం హౌస్ కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకొని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హరీశ్ రావును అరెస్ట్ చేసి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసు ప్రవర్తనను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. నల్గొండ ఎమ్మల్యేలు అసెంబ్లీకి పోకుండా ఫాం హౌస్ కు వెళుతుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాత్రం అరెస్ట్ చేయడం ఏంటని నిలదీశారు. ప్రస్తుతం ఎర్రవెల్లిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.

This post was last modified on September 8, 2026 1:55 pm

Share

Recent Posts

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

4 hours ago

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

10 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

11 hours ago

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

12 hours ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

14 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

14 hours ago