Trends

మీరు కొనే ఫుడ్ ప్యాకెట్‌పై `రెడ్` సింబ‌ల్ ఉందా… అయితే జాగ్ర‌త్త‌!

ఇన్ స్టెంట్ ఫుడ్ కొనుగోలు, వినియోగం కూడా మ‌న‌దేశంలో భారీగా పెరిగిపోయింది. అవి చిప్స్ నుంచి ఇత‌ర ప‌దార్థాల వ‌ర‌కు అనేక ఇన్ స్టెంట్ ఫుడ్స్‌ను మాల్స్‌, మార్ట్స్‌ల‌లో కొనుగోలు చేస్తుంటాం. అయితే.. వాటి నాణ్య‌త‌.. రుచి విష‌యంలో మ‌న‌కు తినేవ‌ర‌కుకూడా తెలియ‌దు. ఇక‌, ఆయా ప‌దార్థాల్లో క‌లిపిన చ‌క్కెర ఎంత‌? ఉప్పు ఎంత‌? కొవ్వు ఎంత ఉంద‌న్న‌ది.. వెతికితే త‌ప్ప‌.. ఎక్క‌డో మూల‌న అది కూడా చిన్న చిన్న అక్ష‌రాల‌తోనే క‌నిపిస్తుంది. ఇక‌, అవ‌న్నీ చ‌దివి తెలుసుకునే ఓపిక ఎవ‌రికి మాత్రం ఉంటుంది. అందుకే ఆబ‌గా లాగించేస్తాం.

ఇటీవ‌ల కాలంలో ఇన్ స్టెంట్ ఫుడ్ కార‌ణంగా ఊబ‌కాయం పెరుగుతున్న కేసులు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఇక‌, షుగ‌ర్‌, బీపీ కేసుల‌కు కూడా ఇన్ స్టెంట్ ఫుడ్సే కార‌ణ‌మ‌ని వైద్యులు మొత్తుకుంటున్నారు. దీంతో ఇలాంటి చిప్స్ వంటివి తిన కూడ‌ద‌ని సూచిస్తున్నారు. అయితే.. తినే నోరు ఆగ‌దు క‌దా!. అందుకే గ‌త ద‌శాబ్ద కాలంలో ఇన్ స్టెంట్ ఫుడ్ మార్కెట్ దేశంలో 70 శాతం మేర‌కు పుంజుకుంది. ఇదేదో ఉత్త‌మాట‌లు కావు. ఇటీవ‌ల పార్ల‌మెంటు స‌మావేశాల్లో ప్ర‌భుత్వ‌మే వెల్ల‌డించింది. దేశంలో ఇన్ స్టెంట్ ఫుడ్ మార్కెట్ జోరుగా సాగుతోంద‌ని తెలిపింది. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయ‌ని వివ‌రించింది.

మ‌రి దీనికి క‌ళ్లెం వేసేదెలా? అంటే.. కొంత మేర‌కు కేంద్ర ఆహార భ‌ద్ర‌తా ప్ర‌మాణాల సంస్థ‌(ఎఫ్ ఎస్ ఎస్ ఏఐ) కొన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంది. అధిక మోతాదులో ఉప్పు వినియోగించినా, చ‌క్కెర ద‌ట్టించినా, కొవ్వు ఉన్నా.. అలాంటి ఇన్ స్టెంట్ ఫుడ్ ప్యాకెట్ల‌పై రెడ్ సింబ‌ల్‌ ముద్రించేలా ఆహార త‌యారీ ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆదేశించేందుకు రెడీ అయింది. ఈ మేర‌కు తాజాగా సుప్రీంకోర్టుకు ఎఫ్ ఎస్ ఎస్ ఏఐ స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో స్ప‌ష్టం చేసింది. అధిక మోతాదులో ఉప్పు, కొవ్వు, పంచ‌దార‌లు వినియోగించి చేసిన ప‌దార్ఘాల ప్యాకెట్ల‌పై అంద‌రికీ క‌నిపించేలా.. పైనే ఈ రెడ్ సింబ‌ల్ ముద్రించ‌నున్నారు.

వాస్త‌వానికి ఇప్ప‌టికే… ప‌లు ప‌దార్థాల‌పై రెడ్ మార్కు ఉంటుంది. అది .. మాంసాహార ప‌దార్థాల‌కు చిహ్నం. గుడ్డు, చికెన్‌, మ‌ట‌న్ స‌హా.. ఇత‌ర మాంసాహారాల‌ను వినియోగించి చేసిన ఫుడ్స్ ప్యాకెట్స్‌పై రెడ్ మార్కు ఉంటుంది. ఇప్పుడు ఉప్పు, కొవ్వు, పంచ‌దారల వినియోగానికి ఒకింత డిఫ‌రెంట్‌గా ఉండే రెడ్ మార్కుతో కూడిన సింబ‌ల్‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్టు ఎఫ్ ఎస్ ఎస్ ఏఐ తెలిపింది. ఇదిలావుంటే.. దేశంలో ఇంగువ‌ను ఇష్ట‌ప‌డే వారు ఎక్కువ మందే ఉంటారు అయితే.. దీనిలోనూ న‌కిలీలు ఉంటున్నాయ‌ని పేర్కొన్న స‌ద‌రు సంస్థ ఎవ‌రెస్ట్‌ ఇంగువ‌పై నిషేధం విధించింది.

This post was last modified on August 30, 2026 6:40 pm

Share

Recent Posts

నయనతారకు దెబ్బ మీద దెబ్బ

హీరోయిన్లలో సూపర్ స్టార్ ఇమేజ్ చాలా కొద్దిమందే సంపాదించుకుంటారు. నయనతార ఆ కోవకే చెందుతుంది. సౌత్ ఇండియాలో తనకంటే వయసు…

2 hours ago

సందీప్ పిలిచినప్పుడు రాకుంటే నేను బతికి వేస్ట్

విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ రోజు టాలీవుడ్లో మిడ్ రేంజ్ స్టార్ల‌లో ఒక‌డిగా నిల‌బ‌డ్డాడంటే.. పాన్ ఇండియా స్థాయిలో అత‌డికి మంచి…

2 hours ago

ప్రభాస్ లాగే యశ్‌కూ… కానీ ప్రభాస్ నయం

ఒక భారీ పాన్ ఇండియా హిట్ కొట్టాక.. ఆ సక్సెస్‌ను నిలబెట్టుకోవడం అంత తేలిక కాదు. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా అసాధారణమైన…

2 hours ago

30 ఏళ్ల వెలిగొండ కల సాకారమయ్యే వేళ

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 ఏళ్ళ క్రితం ఏ ముఖ్యమంత్రి అయితే వెలిగొండ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారో…

3 hours ago

ఔను… వాళ్ళిద్దరినీ పూర్తిగా వాడుకోలేదు

ఇరుముడి ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఇద్దరికీ మాత్రం దాని వల్ల పూర్తి ప్రయోజనం దక్కలేదని చెప్పాలి. మొదటి పేరు…

4 hours ago

యష్ తల్లి ఆవేదనలో న్యాయముంది కానీ

బాక్సాఫీస్ వద్ద టాక్సిక్ ఎదురీదుతున్న వైనం ఒకవైపు, కావాలని కొందరు నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని కన్నడ మూవీ లవర్స్ కొందరు…

4 hours ago