Political News

సాయి రెడ్డికి సజ్జల కౌంటర్… జగనే నెంబర్ 1

వైసీపీ అధినేత జ‌గ‌న్ పేద‌ల ప‌క్ష‌పాతి అని.. ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు చేశార‌ని.. ఆ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. అయితే.. కొంద‌రు.. ఇప్పుడు ఆయ‌న‌ను టార్గెట్ చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. అందుకే వ్య‌క్తిత్వ హ‌నానికి పాల్ప‌డుతున్నార‌ని తెలిపారు. ఈ మేర‌కు ఆదివారం ఆయ‌న‌.. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. వైసీపీ మాజీ నాయ‌కుడు వి. విజ‌య‌సాయిరెడ్డి శ‌నివారం సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసిన వ్యాఖ్య‌ల‌పై స‌జ్జ‌ల ప‌రోక్షంగా స్పందించారు.

వైసీపీలో నెంబ‌ర్ 1 జ‌గ‌నేన‌ని స‌జ్జ‌ల చెప్పారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారి గురించి మాట్లాడ‌కూడ‌ద‌న్న నియమాన్ని తాము పాటిస్తున్నామ‌ని.. జ‌గ‌న్ త‌మ‌కు నిర్దేశించిన సూత్రం ఇదేన‌ని చెప్పారు. జ‌గ‌న్ కూడా పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిపై ఎప్పుడూ వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని చెప్పారు. సొంత కార‌ణాల‌తోనే సాయిరెడ్డి పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయార‌ని వ్యాఖ్యానించారు. అయితే.. బ‌య‌ట‌కు వెళ్లిపోయిన వారు జ‌గ‌న్‌ను టార్గెట్ చేయ‌డం కొత్త‌కాద‌ని తెలిపారు. వైసీపీని విమ‌ర్శించే తీరు మార‌డం లేద‌న్న స‌జ్జ‌ల కేవ‌లం పాత్రలు మాత్ర‌మే మారుతు న్నాయ‌ని వ్యాఖ్యానించారు.

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్ ప్ర‌స్తావిస్తున్నార‌ని.. అయితే… వాటిని ఏదో ఒక విధంగా దారిమ‌ళ్లించేందుకు ఇలా విమర్శ‌లు చేయిస్తున్నార‌ని.. స‌జ్జ‌ల తెలిపారు. సుదీర్ఘ‌కాలం పార్టీకి నేతృత్వం వ‌హించే శ‌క్తి జ‌గ‌న్‌కు ఉంద‌ని చెప్పారు. పార్టీలో అన్ని నెంబ‌ర్లు జ‌గ‌నేన‌ని వ్యాఖ్యానించారు. పార్టీలో నెంబ‌ర్ 1, 2 అనేవి ఏవీ లేవ‌న్నారు. జ‌గ‌న్‌తో 40 ఏళ్లుగా సాయిరెడ్డి క‌లిసి న‌డిచార‌ని.. అలాంటి వ్య‌క్తి.. ఇప్పుడు జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇలా వ్యాఖ్య‌లు చేయ‌డం ఆయ‌న‌కు(సాయిరెడ్డికి) స‌రికాద‌ని స‌జ్జ‌ల తెలిపారు.

ఇది దారుణం కాదా..

జ‌గ‌న్ హ‌యాంలో మ‌త మార్పిడుల‌ను ప్రోత్స‌హించార‌ని సాయిరెడ్డి చెప్ప‌డం దారుణం కాదా? అని స‌జ్జ‌ల ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ ఒక‌వేళ మ‌త మార్పిడుల‌ను ప్రోత్స‌హించి ఉంటే.. సాయిరెడ్డిని కూడా మార్చేవారు క‌దా? అని అన్నారు. సాయిరెడ్డికి కొంద‌రు ఉద్దేశ పూర్వ‌కంగా ప‌బ్లిసిటీ పెంచుతున్నార‌ని వ్యాఖ్యానించారు. వైసీపీలో కోట‌రీ ఉంటే అన్ని సంవ‌త్స‌రాలు.. ఎలా ఉన్నార‌ని ప్ర‌శ్నించారు. వైసీపీలో ఏ ప‌ద‌వి అయినా.. బాధ్య‌తేన‌ని.. అది అధికారం కాద‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు సాయిరెడ్డి విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని.. స‌జ్జ‌ల ఆరోపించారు. 

This post was last modified on August 30, 2026 4:23 pm

Share

Recent Posts

ఇకపై జగన్ రోజూ కోర్టుకు వెళ్లాల్సిందేనా

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…

47 minutes ago

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

4 hours ago

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

5 hours ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

10 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

11 hours ago

కొడతావా… కొట్టుకో

ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనతో దేశ…

11 hours ago