Movie News

కీర్తి సురేష్ క్లాసు ప్లస్ మాసు… ఒకే రోజులో

నిన్న విడుదలైన యెషనాగుల కట్ట మీద పాట సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తోంది. ముఖ్యంగా ఇతర స్టార్ హీరోల అభిమానులు తమకిష్టమైన పాటలకు ఆ సాంగ్ జోడించి ఎడిట్స్ చేయడం తెగ వైరల్ అవుతోంది. చిరంజీవి దగ్గర నుంచి పక్క రాష్ట్రం శివ కార్తికేయన్ వరకు ఎవరిని వదలకుండా దీని కోసం వాడేస్తున్నారు. ఒరిజినల్ రిలీజ్ కన్నా ముందే ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడం ది ప్యారడైజ్ బృందానికి చాలా ప్లస్ అయ్యింది. దీంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

నాని, కీర్తి స్టెప్పులకు మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. చాలా మంది గుంటూరు కారం రేంజ్ లో ఊహించుకున్నారు కానీ శ్రీలీల ఎనర్జీని కీర్తి సురేష్ తో పోల్చడం సరికాదు కాబట్టి, విడిగా చూసుకుంటే పాటకు ఆట సందీప్ కంపోజ్ చేసిన నృత్యాలు స్లో పాయిజన్ అయ్యేలా ఉన్నాయి. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ఒక విషయాన్ని ప్రస్తావించాలి. సెప్టెంబర్ 24 ‘ప్యారడైజ్’ విడుదల కాగా సెప్టెంబర్ 25 తమిళ మూవీ ‘డోరోతి’ రిలీజ్ కానుంది. ఇందులో కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్.

నిన్న యెషనాగుల పాట వచ్చిన కొన్ని గంటలకే డొరోతి నుంచి ఇళయరాజా స్వరపరిచిన ‘మత్తుమణి’ ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మిలియన్నర వ్యూస్ తెచ్చేసుకుంది. ఇది ఫాస్ట్ బీట్ సాంగ్ కాదు. మంచి మెలోడీ. యెష నాగుల కట్టలో కీర్తి సురేష్ హుషారుగా ఆడిపాడితే డొరొతీలో పద్ధతైన చీరకట్టులో గ్రామ్ ఫోన్ రికార్డు దగ్గర కూర్చుని రాజా మాయాజాలంలో తేలడం ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ప్యారడైజ్ ఊర మాస్ అయితే డొరొతీ అల్ట్రా క్లాస్ గా నిలిచింది.

రెండింటిలోనూ కీర్తి సురేష్ ఉండటంతో ఈ పోలిక తేవాల్సి వచ్చింది. కాకతాళీయంగా రెండు ఒకే రోజు గ్యాప్ తో రిలీజ్ కానుండటం గమనార్హం. అయితే ప్యారడైజ్ లో తను మెయిన్ లీడ్ కాకపోయినా మాస్ ఆడియన్స్ పరంగా ఎక్కువ ఫుల్ ఇచ్చే పాటలో నటించింది కాబట్టి తను కూడా హైలైట్ అవుతోంది. ఇక డోరోతి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ఇప్పటికే ఈ మూవీ పలు ఇంటర్నేషనల్ అవార్డులు దక్కించుకుంది. కమర్షియల్ గా సక్సెసవుతుందన్న నమ్మకంతో తమిళ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. 

This post was last modified on August 30, 2026 12:51 pm

Share

Recent Posts

ఇకపై జగన్ రోజూ కోర్టుకు వెళ్లాల్సిందేనా

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…

44 minutes ago

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

4 hours ago

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

5 hours ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

10 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

11 hours ago

కొడతావా… కొట్టుకో

ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనతో దేశ…

11 hours ago