Movie News

అశ్వత్థామను ఆపేయడం మంచి పనే…

అశ్వత్థామ.. ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్, పైగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమా. షాహిద్ కపూర్ తన కెరీర్ కు అతిపెద్ద సినిమా అవుతుందని అనుకున్నాడు. కానీ అలాంటి ప్రాజెక్ట్ ఆగిపోతే ఎవరికైనా బాధ ఉండటం సహజమే. కానీ ఇప్పుడు నిర్మాత జాకీ భగ్నానీ చెప్పిన కారణం వింటే మాత్రం తొందరపడి సెట్స్‌పైకి వెళ్లకపోవడమే మంచిదైందేమో అనిపిస్తోంది. ఈ సినిమా ఆగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని, వాటిలో ‘కల్కి 2898 ఏడీ’ రావడం కూడా ఒకటని ఆయన చెప్పాడు.

‘అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్’ను 2024 మార్చిలో చాలా గ్రాండ్‌గా ప్రకటించారు. సచిన్ రవి దర్శకత్వంలో షాహిద్‌ను మహాభారతంలోని చిరంజీవి అశ్వత్థామగా చూపించాలనుకున్నారు. కథ మాత్రం ఇప్పటి కాలంలో నడిచేలా ప్లాన్ చేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో తీసుకురావాలనే లెక్క కూడా ఉంది. అంటే షాహిద్ కెరీర్‌లోనే పెద్ద సినిమాల్లో ఒకటిగా మారే అవకాశం ఉన్న ప్రాజెక్ట్ ఇది.

అయితే అదే ఏడాది జూన్‌లో ‘కల్కి’ వచ్చింది. అమితాబ్ బచ్చన్ చేసిన అశ్వత్థామ పాత్ర సినిమాకే పెద్ద హైలైట్‌గా నిలిచింది. వృద్ధుడిగా కనిపించినా ప్రభాస్‌తో సమానంగా తలపడే యోధుడిగా నాగ్ అశ్విన్ ఆ క్యారెక్టర్‌ను భారీగా చూపించాడు. పైగా ఆ పాత్ర కథ అక్కడితో ముగియలేదు. ‘కల్కి 2’ షూటింగ్‌లో కూడా అమితాబ్ ఇప్పటికే పాల్గొన్నాడు. అంటే ప్రేక్షకుల మైండ్‌లో అశ్వత్థామకు ఒక బలమైన రూపం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇలాంటి టైమ్‌లో షాహిద్ సినిమాను మొదలుపెడితే పోలికలు తప్పేవి కాదు. భారీగా డబ్బు ఖర్చు చేసినా ప్రేక్షకుడు సినిమా చూడడని, కంటెంట్ కొత్తగా లేకపోతే ఆ ఖర్చంతా వృథా అవుతుందని జాకీ చెప్పాడు. పైగా అశ్వత్థామ పేరుతో భారీ సినిమా ఆగిపోవడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు ఆదిత్య ధర్, విక్కీ కౌశల్‌తో ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ ప్లాన్ చేశాడు. బడ్జెట్ లెక్కలు కుదరక ఆ ప్రాజెక్ట్ కూడా ముందుకు వెళ్లలేదు. 

ఇప్పుడు షాహిద్ సినిమా దగ్గర కూడా భారీ స్కేల్, ఖర్చు విషయంలో ఇబ్బందులు వచ్చినట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు ‘కల్కి’తో కొత్తదనం అనే సమస్య కూడా చేరడం మరో హెచ్చరికే. అనౌన్స్ చేశాం కాబట్టి ఎలాగైనా సినిమా తీయాలనే పట్టుదల కంటే, సరైన సమయంలో ఆగిపోవడం కూడా నిర్మాత తీసుకునే మంచి నిర్ణయమే.

This post was last modified on August 17, 2026 10:22 pm

Share

Recent Posts

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

34 minutes ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

1 hour ago

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…

1 hour ago

సూర్య పాత్రలో షాకింగ్ ట్విస్టుందా?

తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…

1 hour ago

విజయవాడ మేయర్ రేసుకు పోటాపోటీ

విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…

2 hours ago

విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తున్నారా

నిన్న విడుదలైన రణబాలి టీజర్ పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అలాని అందరూ యునానిమస్ గా…

3 hours ago