Political News

ఇదీ… చంద్రబాబు సత్తా!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అమ‌లు చేస్తున్న రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సిస్ట్‌(RTGS) రాష్ట్రంలోని అన్ని వ్య‌వ స్థ‌ల‌ను ప‌రిశీలిస్తున్న విష‌యం తెలిసిందే. త‌క్ష‌ణ ప్ర‌భుత్వ పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు చేర‌వేయ‌డంలోనూ.. పాల‌న‌లోని లోటుపాట్ల‌ను తెలుసుకోవ‌డంలోనూ ఆర్‌టీజీఎస్ కీల‌క రోల్ పోషిస్తోంది. అలాగే.. విప‌త్తులు సంభ‌వించిన‌ప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రించాలి? సీజ‌న్ల వారీగా ఏం చేయాలి? ఎక్క‌డ ఏం జ‌రుగుతోంది? సీసీ టీవీ మానిట‌రింగ్‌.. ఇత‌ర వ్య‌వ‌స్థ‌ల ప‌నితీరు.. ఇలా అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను ఆర్‌టీజీఎస్ మానిటరింగ్ చేస్తోంది.

ఈ వ్య‌వ‌స్థ దేశంలోనే తొలిసారి ఏపీలో 2024 నుంచి అమ‌ల‌వుతోంది. దీనివ‌ల్ల పాల‌న మ‌రింత మెరుగ్గా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతోంది. ఈ విష‌యం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌ని సీఎం చంద్ర‌బాబు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా రాజ‌స్థాన్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదేశాల మేర‌కు.. అక్క‌డి ఐటీశాఖ అధికారులు ఏపీకి వ‌చ్చారు. ఆర్‌టీజీఎస్ ప‌నితీరు.. దీనిని త‌మ రాష్ట్రంలో ఎలా వినియోగించాలి.. దీని వ‌ల్ల ఒన‌గూరుతున్న ప్ర‌యోజ‌నాల‌ను వారు తెలుసుకున్నారు.

అమరావతి లోని రాష్ట్ర స‌చివాల‌యం రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ క‌మాండ్ కంట్రోల్ కేంద్రాన్ని రాజ‌స్థాన్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెందిన ఐటీ శాఖ ఉన్నతాధికారుల బృందం సంద‌ర్శించింది. ఈ బృందానికి ఆర్టీజీఎస్ సీఈఓ ప్ర‌ఖ‌ర్ జైన్ ఆర్టీజీఎస్ పనితీరు గురించి ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు. ఆర్టీజీఎస్ ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న డేటా డ్రివ‌న్ గ‌వ‌ర్నెన్స్ ఆశ‌యాల గురించి, డేటాలేక్‌, దానిద్వారా ఒన‌గూరుతున్న ప్ర‌యోజ‌నాల గురించి ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు.

ప్ర‌భుత్వంలోని 40 శాఖల‌ను ఒక‌చోట‌కు తీసుకొచ్చి అతిపెద్ద డేటాలేక్ ను రూపొందించామ‌న్నారు. కృత్రిమ మేథ(ఏఐ)ని వినియోగించుకుని డేటా ఆధారంగా పాల‌న మ‌రింత స‌ర‌ళ‌త‌రం చేస్తున్న‌ట్టు వివ‌రించారు. దీనివ‌ల్ల‌ ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందేలా ప‌లు ర‌కాల యూస్ కేసెస్ రూపొందించామ‌ని తెలిపారు. ఇక‌, ఈ వ్య‌వ‌స్థ‌ను రాజస్థాన్‌లో ఏర్పాటు చేసుకునేందుకు, శిక్ష‌ణ ఇచ్చేందుకు ఏపీ ప్ర‌భుత్వం తో రాజ‌స్థాన్ ఒప్పందం చేసుకోనుంద‌ని అధికారులు తెలిపారు. 

This post was last modified on July 29, 2026 3:23 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

35 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago