స‌ర్వీస్ గ‌న్‌తో కాల్చుకుని డీజీపీ ఆత్మ‌హ‌త్య‌

దేశంలో సంచ‌ల‌న ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్వీసు రివార్వ్‌తో కాల్చుకుని ఏసీపీ, ఎస్సై, సీఐ వంటి పోలీసు అధికారులు హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. కానీ, దేశంలోనే తొలిసారి ఒక రాష్ట్రానికి పోలీసు బాస్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న డీజీపీ త‌న స‌ర్వీసు రివాల్వ‌ర్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. అది కూడా ఆయ‌న కార్యాల‌యానికి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇత‌ర అధికారులతో స‌మావేశమ‌య్యారు. అనంత‌రం తిరిగి ఆయ‌న నివాసానికి వెళ్లిపోయారు.

ఆ త‌ర్వాత కొద్ది సేప‌టికే డీజీపీ ధ‌న్క‌డ్ త‌న స‌ర్వీసు రివాల్వ‌ర్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. కాగా, ఈ ఘ‌ట‌న విష‌యం తెలిసిన వెంట‌నే అధికారులు హుటాహుటిన ధ‌న్క‌డ్‌ను అగర్తలాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్ప‌టికే ఆయన ప్రాణాలు విడిచార‌ని వైద్యులు ధ్రువీక‌రించారు. దీంతో తిరిగి ధ‌న్క‌డ్ నివాసానికి చేర్చేశారు. రాష్ట్ర పోలీసు బాస్‌.. ఆత్మహత్యకు పాల్పడటంతో త్రిపుర పరిపాలన, పోలీసు వర్గాల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మైంది.

ఎవ‌రీ ధ‌న్క‌డ్‌..

ఈశాన్య రాష్ట్రం త్రిపుర‌కే చెందిన అనురాగ్‌.. 1994లో యూపీఎస్సీ ద్వారా ఐపీఎస్‌కు ఎంపిక‌య్యారు. అప్ప‌టి నుంచి ఆయ‌న కొన్నాళ్లు కేంద్ర స‌ర్వీసుల్లో ప‌నిచేయ‌గా.. తర్వాత త్రిపుర‌లోనే వివిధ హోదాల్లో సేవ‌లు అందించారు. స‌ర్వీసు ప‌ట్ల నిబద్ధ‌త‌గా వ్య‌వ‌హ‌రించే అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నార‌ని అధికారులు చెబుతున్నారు. ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించిన స‌మాచారంపై అధికారులు ద‌ర్యాప్తుచేస్తున్నారు. కాగా.. పోస్టు మార్టంకు కుటుంబ స‌భ్యులు నిరాక‌రించిన‌ట్టు తెలిసింది. మ‌రోవైపు ఈ ఘ‌ట‌నపై ఉన్న‌త‌స్థాయి విచార‌ణ‌కు ఆదేశిస్తున్న‌ట్టు త్రిపుర ముఖ్య‌మంత్రి మాణిక్ సాహా తెలిపారు. ఈ ఘ‌ట‌న తీవ్రంగా క‌ల‌చి వేసింద‌ని పేర్కొన్నారు.