కేవలం ఒక నెల రోజుల గ్యాప్ లో బాక్సాఫీస్ మూడు విలువైన పాఠాలు నేర్చుకుంది. ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి కంటెంట్ ఇవ్వాలనే దాని గురించి మూడు సినిమాలు ఇచ్చిన లెసన్స్ పదే పదే నేర్చుకునేలా ఉన్నాయి. తాజాగా ‘మండాడి’ వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టింది. సూరి, సుహాస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సముద్రపు డ్రామా తమిళనాడులో అదిరిపోయే బ్లాక్ బస్టర్ సాధించింది. రెండు వారాలు కాకుండానే వంద కోట్ల గ్రాస్ లో అడుగు పెట్టడం చిన్న విషయం కాదు.
ఇంకోవైపు ‘మీర్జాపూర్’ ఏకంగా మూడు వందల కోట్లను జేబులో వేసుకుంది. మూడు సీజన్లుగా వచ్చిన వెబ్ సిరీస్ ని సినిమాగా తీస్తే జనం చూస్తారానే అనుమానాలు ముంబై మీడియా వర్గాల్లో బలంగా ఉండేవి. కానీ ఆడియన్స్ వాటిని పట్టించుకోలేదు. కలీన్ భయ్యా సామ్రాజ్యాన్ని కొత్త కథతో బిగ్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేశారు. హెచ్చుతగ్గులు ఎన్ని ఉన్నా తమను సంతృప్తి పరిచిందనే ఆనందంతో కలెక్షన్లు ధారాళంగా కురిపించారు. దెబ్బకు ఇతర వెబ్ సిరీస్ లు మూవీస్ గా మారేందుకు రెడీ అవుతున్నాయట.
ఇక ‘బెత్లెహాం కుటుంబ యూనిట్’ గురించి తెలిసిందే. చాలా తేలికగా త్రీ హండ్రెడ్ క్రోర్స్ పతకం అందుకుంది. దీని తాకిడి ఎంతగా ఉందంటే నిర్మాతల విన్నపం మేరకు మొన్న సెప్టెంబర్ 18 స్ట్రీమింగ్ జరగాల్సిన ఓటిటి రిలీజ్ ని వాయిదా వేసేంతగా. ఈ మూడు సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్ ఏమిటంటే దేంట్లోనూ పెద్ద స్టార్స్ లేరు. ఇమేజ్ తో ఓపెనింగ్స్ తెచ్చే నటీనటులు లేరు. కేవలం కంటెంట్ నమ్ముకుని, బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా చాలా కాన్ఫిడెంట్ గా ఖర్చు పెట్టినవి.
వీరి సరసన ‘ఇరుముడి’ని చేర్చడం లేదు. ఎందుకంటే ఇందులో ఉన్నది రవితేజ అనే మాస్ మార్కెట్ బలంగా ఉన్న హీరో. తన ఇమేజ్ శివ నిర్వాణ ఇచ్చిన స్ట్రాంగ్ కంటెంట్ కి చాలా ప్లస్ అయ్యింది. కానీ పైన మూడులో దేనికీ ఇలాంటి అడ్వాంటేజ్ లేదు. అయినా మేజిక్ చేసి చూపించాయి. వాటిలో నటించిన ఆర్టిస్టుల తర్వాతి సినిమాలకు డిమాండ్ తెచ్చి పెట్టాయి. సో ఇకపై రచయితలు దర్శకులు కాంబినేషన్ కన్నా ఎక్కువగా మంచి కథల మీద దృష్టి పెట్టాలి. వందల కోట్ల కలెక్షన్లు పెద్ద మ్యాటరేం కాదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates