వచ్చే వారం జూలై 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద క్రమంగా పాజిటివ్ బజ్ పెరుగుతోంది. టీమ్ చెప్పిన స్థాయిలో మణిశర్మ పాటలు బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టేయలేదు కానీ ఉన్నంతలో మంచి వ్యూస్ తో అంచనాలు పెంచేందుకు తోడ్పడ్డాయి. కిరణ్ అబ్బవరం తన కెరీర్ బెస్ట్ మూవీగా దీనికే కిరీటం పెట్టేయగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సాయిరాజేష్, ఎస్కెఎన్, ధీరజ్ మొగిలినేని హిట్టు ఖాయమనే నమ్మకంతో కనిపిస్తున్నారు. ఇక శకునాల విషయానికి వద్దాం.
ముందు వెనుకా చెన్నై లవ్ స్టోరీకి పెద్దగా కాంపిటీషన్ లేదు. జూలై 17 తెలుగులో ఏడెనిమిది సినిమాలు రిలీజవుతున్నా వాటిలో ఒక్కదానికి కూడా సరైన బజ్ లేదు. యునానిమస్ గా దేనికైనా టాక్ వస్తే తప్ప అవి నిలదొక్కుకోలేవు. క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సి ఉంది కానీ బిసి సెంటర్స్ లో దీని ప్రభావం ఒక మోతాదు వరకే ఉంటుంది. రెండో వారంలో అదింకా తగ్గిపోతుంది. సో చేతిలో ఉన్న తొమ్మిది రోజులు కిరణ్ టీమ్ పబ్లిసిటీ బాగా చేసుకుంటే ఓపెనింగ్స్ పెంచుకోవచ్చు.
ఇక ఒక రోజు ముందు వస్తున్న జన నాయకుడు గురించి చెన్నై లవ్ స్టోరీ టెన్షన్ పడటం లేదు. ఏపీ తెలంగాణలో విజయ్ కు ఎంత పెద్ద రిలీజ్ దక్కినా అది భగవంత్ కేసరి రీమేక్ కావడం వల్ల మన జనాలు పొలోమని థియేటర్లకు పోవడం ఉండదు. అభిమానులు మొదటి రోజు స్వాగతం చెప్పినా తర్వాత రావాల్సింది కామన్ ఆడియన్సే. ఆల్రెడీ బాలయ్యని అదే కథలో చూశాక మళ్ళీ విజయ్ ని ఫ్రెష్ గా చూడమంటే మాస్ జనాలకు పనయ్యే వ్యవహారం కాదు.
అటుపై వారం శ్రీనివాస మంగాపురం ఉంది కానీ ఆలోగా చెన్నై లవ్ స్టోరీ కనక పాజిటివ్ టాక్ తో స్టాండ్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పేరుకి సాఫ్ట్ లవ్ స్టోరీలా అనిపించినా అసలు సినిమాలో బోలెడంత ఎమోషన్లు ట్విస్టులు ఉంటాయట. వాటిని టీజర్ లో ట్రైలర్ లో చూపించకుండా జాగ్రత్త పడతారట. చెన్నై లవ్ స్టోరీ హిట్ అయితే కిరణ్ అబ్బవరం మార్కెట్ మరింత పెరుగుతుంది. ఇదే ఏడాది తన డైరెక్షన్ డెబ్యూ సినిమా కూడా విడుదల కానుంది కాబట్టి దానికీ ప్లస్ అవుతుంది.
This post was last modified on July 15, 2026 10:26 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…