Movie News

నాగవంశీ 100 కోట్ల కోరిక తీరుతుందా

లెనిన్ సక్సెస్ మీట్ గుంటూరులో ఘనంగా జరిగింది. దశాబ్దంకు పైగా ఎదురు చూసిన విజయం కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయ్యగారు నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో ఆ లైన్ కి విపరీతమైన పాపులారిటీ తెచ్చిన నాగరాజు హాజరు కావడం ఫ్యాన్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదే పనిగా క్యారవాన్ లోకి పిలిచి మరీ అఖిల్ తనతో ముచ్చటించడం విశేషం. నిర్మాత నాగవంశీ తో సహా యూనిట్ మొత్తం హాజరు కాగా మంత్రి కందుల దుర్గేష్ స్పెషల్ గెస్టుగా విచ్చేశారు.

ఇదిలా ఉండగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ అఖిల్ కు మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇవ్వాలని, మీరు కూడా తనకు తోడు ఉండాలని అక్కడికి వచ్చిన ప్రేక్షకులను ఉద్దేశించి చెప్పడం గమనార్షం. ఇది అఖిల్ కు రిటర్న్ గిఫ్ట్ అవుతుందని నొక్కి చెబుతూ ఫ్యాన్స్ ని ఎమోషనల్ గా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం లెనిన్ నిర్మాణ సంస్థ ప్రకటించిన దాని ప్రకారమే సోమవారం దాకా అరవై ఎనిమిది కోట్ల దగ్గరలో ఉంది. మంగళ బుధ వారాల్లో డీసెంట్ నెంబర్స్ వచ్చి ఉంటాయి.

వంద కోట్లు రావాలంటే వీకెండ్ మొత్తం అఖిల్ తన కంట్రోల్ లోకి తీసుకోవాలి. అయితే ఏ సెంటర్స్ లో క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సి ప్రభావం చూపించేలా ఉంది. పైగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ సిద్ధం చేయడంతో సాధారణ ఆడియన్స్ కూడా దీని వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకో ఏడెనిమిది చిన్న సినిమాలు ఉన్నాయి కానీ అవేవి బజ్ పరంగా ఆసక్తి రేపుతున్నవి కాదు. సో లెనిన్ కు వీకెండ్ లో ఓపెన్ గ్రౌండ్ ఉంటుందని చెప్పొచ్చు. వాడుకోవడం కీలకం.

నాగవంశీ ఇంత పర్టికులర్ గా ఉండటానికి కారణం లేకపోలేదు. సంక్రాంతికి అనగనగ ఒక రాజు వంద కోట్లు వసూలు చేసిందని పోస్టర్ వేశారు. అది హిట్ అయిన మాట వాస్తవమే కానీ అంత వసూలు చేసిందానే దాని మీద అనుమానాలు లేకపోలేదు. అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కాబట్టి స్టాంప్ పడింది. తర్వాత ఫంకీ డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు లెనిన్ రూపంలో ఒక ఛాన్స్ దొరికింది. వంద కోట్ల మార్కు అంత సులభం కాదు కానీ అసాధ్యం కూడా కాదు. ఇది వారాంతం పెర్ఫార్మన్స్ మీద ఆధారపడి ఉంటుంది. 

This post was last modified on July 15, 2026 10:43 pm

Share

Recent Posts

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

2 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

3 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

4 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

6 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

8 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

8 hours ago