మన దేశం నుంచి ఎంతోమంది టాలెంటెడ్ యువత సరైన రూల్స్ పాటిస్తూ చదువు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్నారు. కానీ కొందరు మాత్రం ఏజెంట్ల మాయలో పడి దొంగచాటుగా, అక్రమ మార్గాల్లో అక్కడికి వెళ్లాలని చూస్తున్నారు. ఇలాంటి పనుల వల్ల వాళ్ల ప్రాణాలకు ముప్పు రావడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి కూడా చెడ్డపేరు వస్తోంది. అయితే ఇప్పుడు ఈ అక్రమ ప్రయాణాలకు బ్రేక్ పడింది.
గతంతో పోలిస్తే అక్రమంగా అమెరికా బోర్డర్ దాటుతూ పట్టుబడుతున్న వారి సంఖ్య ఇప్పుడు అనూహ్యంగా తగ్గిపోయింది. అమెరికా కస్టమ్స్ లెక్కల ప్రకారం అక్టోబర్ 2025 నుంచి మే 2026 మధ్య కాలంలో 20,614 మంది మాత్రమే పట్టుబడ్డారు. అదే 2023లో ఇదే ఎనిమిది నెలల సమయంలో ఆ సంఖ్య ఏకంగా 67 వేలకు పైగా ఉండేది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే అక్రమ చొరబాట్లు రికార్డు స్థాయిలో 69 శాతం మేర పడిపోయాయి.
మెక్సికో బోర్డర్ నుంచి అక్రమంగా వెళ్లే వారి సంఖ్య ఏకంగా 99 శాతం తగ్గింది. 2023లో ఆ రూట్ లో 30 వేల మందికి పైగా పట్టుబడితే, ఈ ఏడాది కేవలం 417 మంది మాత్రమే దొరికారు. అలాగే కెనడా బోర్డర్ లో కూడా 91 శాతం మేర చొరబాట్లు తగ్గాయి. కెనడాలో మన వాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల కొందరు ఆ దారిని ఎంచుకున్నా, ఇప్పుడు అక్కడ కూడా పటిష్టమైన నిఘా ఉండటంతో వెనక్కి తగ్గుతున్నారు.
ఇలాంటి అక్రమ ప్రయాణాలు మానుకోవాలని, మోసగాళ్ల వలలో పడొద్దని దేశ అధికారులు, ఇమ్మిగ్రేషన్ సంస్థలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడున్న అమెరికా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ రూల్స్ ను చాలా కఠినం చేసింది. బార్డర్ దాటి వచ్చినా సరే ఆశ్రయం కల్పించేది లేదని తేల్చి చెప్పేసింది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒకసారి ఫెయిల్ అయితే, మళ్లీ మళ్లీ ట్రై చేసే ఆర్థిక స్థోమత సామాన్యులకు ఉండదు కాబట్టి చాలామంది రియలైజ్ అవుతున్నారు.
సరైన డాక్యుమెంట్స్ తో, నిజాయితీగా వెళ్లే టాలెంటెడ్ ఇండియన్స్ కు అమెరికాలో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కానీ షార్ట్ కట్స్ లో వెళ్లాలనుకునే కొందరి వల్లే అనవసరమైన సమస్యలు వస్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడు కఠినమైన రూల్స్ వలన జనాల్లో మార్పు వస్తోంది. చాలా వరకు అక్రమ ప్రయాణాలు ఈ స్థాయిలో తగ్గిపోవడం మాత్రం నిజంగా మంచి విషయమే.
This post was last modified on July 16, 2026 10:03 am
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…