Movie News

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి పూనుకుని ‘సింగ్ గీతం’ లాంటి క్లాసిక్, అది కూడా మాటలు లేకుండా కేవలం పాటల రూపంలో ఇవ్వడం ఈ రోజుల్లో కనీసం ఊహల్లో కూడా అనుకోని గొప్ప ప్రయోగం. అయితే సింగీతం ఇలాంటి సాహసాలు చేయడం తొమ్మిది దశాబ్దాల ప్రస్థానంలో కొత్తది కాదు. వాటిలో కొన్ని విశిష్టమైనవి, ప్రత్యేకమైనవి ఉన్నాయి. వాటి ముచ్చట్లు చెప్పుకుందాం.

కమల్ హాసన్ లాంటి ఇమేజ్ ఉన్న హీరోతో డైలాగులు లేకుండా కేవలం మూగ సైగలతో ‘పుష్పక విమానం’ తీసినప్పుడు దాని ఫలితం గురించి అనుమాన పడిన వాళ్ళు ఎందరో. వాటిని పటాపంచలు చేస్తూ కామెడీ, క్రైమ్ రెండూ మిక్స్ చేసి వండిన వంటకం భాషతో సంబంధం లేకుండా అందరినీ మెప్పించింది. హీరోని మూడు అడుగుల పొట్టివాడిగా చూపించడమనే సాహసం ‘విచిత్ర సోదరులు’లో చేశారు సింగీతం. ఎలాంటి గ్రాఫిక్స్ వాడకుండా కమల్ ని మరుగుజ్జుగా మార్చిన వైనం అప్పట్లో సంచలనం.

సైన్స్ ఫిక్షన్ లో కొత్త ఒరవడి సృష్టించిన ‘ఆదిత్య 369’ బాలకృష్ణ కెరీర్ లో ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. గతం, వర్తమానం, భవిష్యత్తు మూడింటికి లింక్ పెట్టి ఇళయరాజా సంగీతం జోడించి సింగీతం ఆవిష్కరించిన మేజిక్ ఎవరూ రిపీట్ చేయలేకపోయారు. జానపద కథలకు కాలం చెల్లిపోయిన టైంలో తీసిన ‘భైరవ ద్వీపం’ కమర్షియల్ సినిమాల హోరులోనూ అద్భుత విజయం సాధించడం ఒక చరిత్ర. భారతీయ టెక్నీషియన్స్ తోనే అంత గొప్ప అవుట్ ఫుట్ రాబట్టుకోవడం నభూతో నభవిష్యత్.

డ్యూయల్ రోల్స్ కష్టమనిపించే టైంలో ఏకంగా నలుగురు కమల్ హాసన్ లను పెట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ‘మైఖేల్ మదన కామరాజు’తో మెప్పించడం సింగీతం గారికే చెల్లింది. ఇప్పుడు బయోపిక్ ల గురించి మాట్లాడుతున్నాం కానీ నలభై సంవత్సరాల క్రితమే సుధా చంద్రన్ టైటిల్ రోల్ లో తీసిన ‘మయూరి’ ఒక ఎపిక్ గా నిలిచింది. ఇలా అరవై సినిమాల ప్రస్థానంలో వారు అందించిన ఎన్నో స్ఫూర్తి దీపికలు ఇప్పటి నాగ్ అశ్విన్ లాంటి ఎందరో దర్శకులకు ఇన్స్ పిరేషన్ గా నిలిచాయి. ఇంకో వందేళ్ల తర్వాతైనా నిలిచిపోతాయి.

This post was last modified on October 4, 2026 11:05 am

Share

Recent Posts

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

3 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

4 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

12 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

12 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

12 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

13 hours ago