తెలుగులో కొన్నేళ్ల నుంచి నడుస్తున్న పాత సినిమాల రీరిలీజ్ ట్రెండు గురించి తెలిసిందే. బాలీవుడ్‌కూ ఈ ట్రెండుకు శ్రీకారం చుట్టిన సినిమా.. తుంబాడ్. రిలీజ్ టైంలో ఆశించిన స్పందన తెచ్చుకోని ఈ చిత్రం.. రెండేళ్ల కిందట రీరిలీజై రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఆ టైంలో రిలీజైన కొత్త సినిమాలను కూడా వెనక్కి నెట్టి కొన్ని వారాల పాటు థియేటర్లను కళకళలాడించింది.
ఫస్ట్ రిలీజ్‌లో తుంబాడ్ సినిమాకు మంచి రివ్యూలు వచ్చినా.. స్టార్ కాస్ట్ లేకపోవడం వల్ల బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం రాలేదు. కానీ ఓటీటీలో జనం దీన్ని బాగానే చూశారు. కాల క్రమంలో ఇది కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఐతే ఓటీటీలో చూసిన చాలామంది ఇది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిన సినిమా అని ఫీలయ్యారు. ఆ ఫీడ్ బ్యాక్ మేకర్స్ వరకు చేరి.. రీ రిలీజ్‌ను చక్కగా ప్లాన్ చేసి సినిమాను వదిలారు. అద్భుత ఫలితం వచ్చింది.
దీంతో తుంబాడ్ మేకర్స్ ఈ చిత్రానికి సీక్వెల్ చేయడానికి నిర్ణయించుకున్నారు. గత ఏడాది మొదలైన సన్నాహాలు ఇప్పుడో కొలిక్కి వచ్చాయి. తుంబాడ్ హీరో సోహమ్ షా.. సీక్వెల్లో నటించడమే కాక, తనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆదేశ్ ప్రసాద్ దర్శకుడు. ఈ చిత్రానికి ఆల్రెడీ నవాజుద్దీన్ సిద్ధిఖి రూపంలో గొప్ప నటుడు తోడయ్యాడు.
ఇప్పుడు ఇంకో పెద్ద అట్రాక్షన్ యాడ్ అయింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన ఆలియా భట్ తుంబాడ్-2లో నటించబోతోంది. మామూలుగానే తుంబాడ్-2లో ప్రేక్షకుల్లో, ట్రేడ్‌లో భారీ అంచలున్నాయి. ఇప్పుడు నవాజుద్దీన్ లాంటి గొప్ప నటుడు, ఆలియా లాంటి పెద్ద స్టార్ తోడవుతుండడంతో క్రేజ్ డబులవుతుందనడంలో సందేహం లేదు. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రాన్ని 2027 డిసెంబరులో విడుదల చేయనున్నారు.
This post was last modified on July 16, 2026 3:14 pm
సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే…
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…