దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో ఆశలు రేపుతోంది. కనీసం రెండు వర్కౌట్ అయినా థియేటర్లు కళకళలాడతాయని ఎదురు చూస్తున్నారు. అన్నింటి కన్నా ముందు ఆదర్శ కుటుంబం ఏకె 47 రానుండగా కేవలం ఒక రోజు గ్యాప్ తో రణబాలి, జైలర్ 2 తలపడనున్నాయి. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఇంత కాంపిటీషన్ కళ్లెదురు కనిపిస్తున్నా గరివిడి లక్ష్మి అనే చిన్న మూవీ పందేనికి సై అంటోంది.
ఆనంది టైటిల్ రోల్ పోషించిన ఈ బయోపిక్ ఒక నిజ జీవిత బుర్రకథ కళాకారిణిది. తొంభై దశకంలో ఉత్తరాంధ్ర ప్రాంతం విజయనగరానికి చెందిన గరివిడి లక్ష్మి అప్పట్లో జానపద ఆటపాటలతో జనాన్ని ఉర్రూతలూగించారు. కేవలం పదిహేను సంవత్సరాలలో పది వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చిన రికార్డు ఆవిడ సొంతం. ఎక్కడైనా జాతరలో లక్ష్మి బుర్రకథ ఉందంటే దూరం లెక్క చేయకుండా సైకిళ్ళ మీద కిలోమీటర్లు దాటి వచ్చి మరీ వినేంత అభిమానం ఆవిడ సొంతం.
అయితే లక్ష్మి ప్రయాణం అంతా పూల పాన్పు కాదు. ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు చూశారు. ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఇరవై నాలుగు గంటలు ప్రదర్శనలు అంటూ వందల ఊళ్లు తిరుగుతూనే ఉండటం ప్రభావం చూపించింది. ఆవిడ పాటలను అమ్ముకుని ఆడియో క్యాసెట్ కంపెనీలు లక్షలు, కోట్లు సంపాదించినా ఈవిడకు నామ మాత్రంగా డబ్బులు చెల్లించేవాళ్ళు. ఈ క్రమంలో ఎన్నో మోసాలు జరిగాయి. అవన్నీ గరివిడి లక్ష్మి సినిమాలో చూపించబోతున్నారు.
రాజా సాబ్ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నుంచి వస్తున్న మూవీ ఇది. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా రకరకాల కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. దర్శకులు గౌరీ నాయుడు చాలా రీసెర్చ్ చేసి ఈ సినిమాని రూపొందించారు. రెండు పాటలు బాగానే రీచ్ అయ్యాయి. అంతా బాగానే ఉంది కానీ వెంకటేష్, రజనీకాంత్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్లను తట్టుకుని ఆనందిని ఒంటరిగా తన గరివిడి లక్ష్మితో ఎలా మెప్పిస్తుందో చూడాలి.
This post was last modified on October 3, 2026 11:36 am
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…