Trends

కేఎల్ యూలో అగ్ని ప్రమాదం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో ఉన్న కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. యూనివర్సిటీ ప్రాంగణంలోని భవనం ఐదో అంతస్తులో సెంట్రల్ లైబ్రరీ నిన్న రాత్రి హఠాత్తుగా పేలుడు వినిపించి మంటలు ఎగిసిపడ్డాయి.

ఉవ్వెత్తున ఎగసిపడిన మంటల ధాటికి క్షణాల్లోనే లైబ్రరీ తగలబడింది. లైబ్రరీలో వేలాది పుస్తకాలు, ఫర్నిచర్ అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే వర్సిటీ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

అయితే, ఆ బ్లాక్ కు సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. కిటికీల నుంచి దట్టమైన పొగ, ఉవ్వెత్తున అగ్నికీలలు ఎగసిపడడంతో క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే వర్సిటీలో కాసేపు గందరగోళం వాతావరణం ఏర్పడింది.

ప్రమాదం సమయంలో లైబ్రరీలో విద్యార్థులు, సిబ్బంది లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని తెలుస్తోంది. ఇక, అదే లైబ్రరీ బ్లాక్ లో విద్యార్థుల సర్టిఫికెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై వర్సిటీ యాజమాన్యం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

This post was last modified on October 2, 2026 7:33 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

33 minutes ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

2 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

2 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

2 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

4 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

5 hours ago