Movie News

అయ్యగారిని కన్నీళ్లతో తడిపేసిన అభిమాని

తెలుగులో మరే హీరోకూ లేని విచిత్రమైన ‘అయ్యగారు’ అనే బిరుదును అఖిల్ అక్కినేని సొంతం చేసుకున్నాడంటే.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాగరాజు అనేే వీరాభిమాని వల్లే. అఖిల్ కెరీర్ ఆరంభంలో ఈ అభిమాని వీరావేశంతో తనను ఉద్దేశించి ‘‘అయ్యగారే నంబర్ వన్.. ఆడే రావాలి.. ఆడే కరెక్టు’’ అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయి అదో పెద్ద మీమ్ టెంప్లేట్ అయింది.

తర్వాతి కాలంలో అఖిల్‌ దగ్గరికి విషయం చేరి ఆ అభిమాని గురించి ఒకట్రెండు సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో కూడా మాట్లాడాడు. అఖిల్ సినిమా వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి ఆ అభిమాని మీదికి వెళ్తుంది. ‘లెనిన్’ సినిమా రిలీజ్ టైంలో కూడా అదే జరిగింది. మీడియా వాళ్లు అతణ్ని ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. ఒక యూట్యూబర్ తన ఆర్థిక పరిస్థితిని కూడా బయటపెట్టాడు. ఈ సందర్భంగా నాగరాజు కల్మషం లేని అభిమానం గురించి అక్కినేని వారికి బాగానే తెలిసినట్లుంది.

తాజాగా ‘లెనిన్’ సినిమా సక్సెస్ ఈవెంట్‌ను నాగరాజు సొంత ప్రాంతమైన గుంటూరులోనే చేశారు. ఆ సందర్భంగా నాగరాజుకు అఖిల్‌ను కలిసే అవకాశం కల్పించారు అభిమానులు. కారవాన్‌లో అఖిల్‌ను కలిసిన వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది. ఈ సందర్భంగా నాగరాజు ఉద్వేగం మామూలుగా లేదు. అఖిల్ కాళ్ల మీద పడిపోయి బోరున ఏడ్చేశారు. తన అభిమానాన్ని మాటల్లో చేతల్లో చూపించేశాడు నాగరాజు.

అతణ్ని ఓదారుస్తూ అఖిల్ కూడా ఎమోషనల్ అయ్యాడు. నీ వల్లే నాకు అయ్యగారు అనే పేరొచ్చింది అని చెప్పాడు. తర్వాత తన భార్యను పరిచయం చేశాడు కూడా. దీంతో నాగరాజు ఆనందానికి అవధుల్లేవు. ఎంతో స్వచ్ఛంగా అనిపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో అఖిల్ భార్యను ఈ సినిమా ఫలితం గురించి అడిగితే ‘అయ్యగారే నంబర్ వన్’ అంటూ ఆ వీరాభిమాని మాటనే వల్లె వేయడం విశేషం.

This post was last modified on July 16, 2026 8:48 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

5 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

8 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

8 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

8 hours ago