Movie News

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు. తారక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి మంచి సందడి చేశాడు. ఆ వీడియోలకు బాగా రీచ్ వచ్చింది. హీరో ఫహద్ ఫాసిల్ రోజుల తరబడి హైదరాబాద్ లో ఉండి పబ్లిసిటీకి పూర్తి సహకారం అందించాడు. నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ తన మార్కెటింగ్ నైపుణ్యం మొత్తం ఉపయోగించి టీజర్ నుంచి ప్రీమియర్ దాకా అన్నీ స్పెషల్ గా ప్లాన్ చేసుకున్నాడు.

ఇదంతా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ గురించని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఓపెనింగ్స్ కావొచ్చు లేదా వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ కావొచ్చు ఆశించినంత వేగంగా లేకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. టాక్ ఎలా ఉందనేది పక్కన పెడితే ఇంత ప్రచారం చూశాక ఫస్ట్ వీక్ వరకు ఇలాంటి మూవీస్ ఎంతో కొంత హోల్డ్ రాబట్టుకుంటాయి. కానీ ట్రబుల్ ఈ విషయంలో కొంచెం ఎదురీదుతోంది. మెయిన్ సెంటర్స్ లో పర్వాలేదు కానీ కింది కేంద్రాల్లో ఎదురుగాలి ఉందని ట్రేడ్ టాక్.

నిజానికి టైటిల్ దగ్గరే సమస్య వచ్చిందని అధిక శాతం అభిప్రాయపడుతున్నారు. చిన్న పిల్లలని టార్గెట్ చేసిన సినిమా అయినప్పటికీ పేరు క్యాచీగా ఉంటే వాళ్ళతో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అవుతారు. ఇలా అర్థం కాకుండా ఇంత పొడవుగా పెడితే జనం నోళ్ళలో తిరిగదు. ఎంత బాలయ్య డైలాగు అయినా అది ఒక ఫ్లాప్ మూవీదని మర్చిపోకూడదు. కంటెంట్ లో ఏముందో ట్రైలర్ లో ముందే ప్రిపేర్ చేసినప్పటికీ అది పూర్తి స్థాయిలో రీచ్ కాలేకపోయింది.

వచ్చే వారం నుంచి ఆదర్శ కుటుంబం ఏకె 47, కామ్రేడ్ కళ్యాణ్, జైలర్ 2, రణబాలి, గరివిడి లక్ష్మి ఇలా వరసగా సినిమాలు క్యూ కట్టి ఉన్నాయి కాబట్టి డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ కి ఈ మొదటి వారం చాలా కీలకం కానుంది. ఒకవేళ యునానిమస్ టాక్ వచ్చి ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు. కానీ మిక్స్డ్ రెస్పాన్స్ ని దాటుకుని వెళ్లాలంటే మాత్రం పికప్ అనూహ్యంగా ఉండాలి. శశాంక్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ సారా పాలేకర్ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

This post was last modified on October 4, 2026 11:52 am

Share

Recent Posts

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

3 minutes ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

43 minutes ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

1 hour ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

4 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

5 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

13 hours ago