Trends

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. తెలంగాణ రూపురేఖలను మార్చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి చివరికి స్మశాన వాటికల అభివృద్దిలోనూ అవినీతి చోటుచేసుకుంటున్న తీరు నిజంగానే కంపరం పుట్టిస్తోందని చెప్పక తప్పదు. ఓ స్మశాన వాటిక అబివృద్ధి పనుల్లోనూ లంచం ఇస్తే తప్పించి బిల్లులు మంజూరు చేయలేనని చెప్పిన ఓ అధికారి తాజాగా పట్టుబడ్డాడు. 

పెద్పల్లి జిల్లాలో మునిసిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ గా పనిచేస్తున్న కల్లేపల్లి సతీశ్ కుమార్ మంగళవారం అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయాడు. ఈయన గారు చేసిన ఘనకార్యం ఏమిటన్న విషయానికి వస్తే..మునిసిపాలిటీ పరిధిలో ఓ స్మశాన వాటికను రూ.12.28 లక్షల విలువైన పనులు జరగగా… ఆ బిల్లులు మంజూరు చేయాలంటే తనకు రూ.2 లక్షలు లంచం ఇవ్వాల్సిందేనని భీష్మించారట. ఇతర ప్రాజెక్టులు అయితే ఏమోలే అనుకోవచ్చు…చివరాఖరుకు స్మశానాలను కూడా వదలరా? అన్న భావనతో పనులు చేసిన కాంట్రాక్టరు ఆయన తీరుపై నేరుగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు.

కాంట్రాక్టరు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు… బాధితుడి నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటున్న మునిసిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ దాడి అనంతరం ఏసీబీ అధికారులు నేరుగా ఏఈ గారి ఇంటిలో సోదాలు చేయగా… జమా లెక్కలు లేని రూ.32.31 లక్షల నగదు కూడా పట్టుబడిందట. వెరసి ఈ ఏఈ గారు పని ఏమిటన్న విషయాన్ని ఎంతమాత్రం పట్టించుకోకుండా… తాను అనుకుంటున్నట్లుగా రెండు చేతులా సంపాదించుకుంటూ సాగుతూ… స్మశానం లంచంతోనే పట్టుబడిపోయిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.

This post was last modified on July 14, 2026 3:36 pm

Share

Recent Posts

శివన్న ‘బెయిల్’కి ప్రేమ దెబ్బ పడింది

జైలర్ తో శివరాజ్ కుమార్ మనకూ దగ్గరయ్యారు. పెద్దిలో రామ్ చరణ్ గురువుగా నటించి దానికీ ప్లస్ అయ్యారు. గౌతమీపుత్ర…

3 minutes ago

రంగస్థలం కాంబో… అసలు టార్గెట్ ఏంటి

పెద్దికి అంత కష్టపడినా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు…

1 hour ago

రికమండేషన్ లేకుండానే కార్యకర్తలకు పదవులు

ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…

2 hours ago

ఇప్పటి వరకు గెలుపులు… ఇకపై మలుపులు

నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…

2 hours ago

జిమ్ జిమ్ తార… కావాలనే వైరల్ చేసారా?

జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…

2 hours ago

69 ల‌క్ష‌ల ఓట్లు హుష్‌..

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(సర్‌)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…

3 hours ago