ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల ఫాస్ట్ బౌలర్‌కు అవకాశం రావడం ఇంకా అరుదు. కానీ భువనేశ్వర్ కుమార్ మళ్లీ భారత జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగే ఐదు టీ20ల సిరీస్‌కు సెలెక్టర్లు భువీని ఎంపిక చేశారు. అతడు చివరిసారి 2022 నవంబర్‌లో భారత్ తరఫున ఆడాడు.
ఈ నాలుగేళ్లలో భువీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నా.. ఐపీఎల్‌లో మాత్రం తన బౌలింగ్‌తో అవకాశాలు వెతుక్కుంటూనే ఉన్నారు. ముఖ్యంగా గత రెండు సీజన్లు బాగా కలిసొచ్చాయి. ఆర్సీబీ తరఫున 2025, 2026 సీజన్లలో కలిపి 45 వికెట్లు తీశారు. ఈ ఏడాది ఐపీఎల్‌లోనే 28 వికెట్లు పడగొట్టారు. పవర్‌ప్లేలో కొత్త బంతిని స్వింగ్ చేయడం ఇప్పటికీ భువీ అసలు బలం.
భువీ విషయంలో ఫిట్‌నెస్ కూడా కీలకంగా మారింది. కొంతకాలంగా ఇంట్లోనే ఫిజియో, ట్రైనర్ సాయంతో ఫిట్‌నెస్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు ఆయన ఇటీవల చెప్పారు. గతంతో పోలిస్తే తన బౌలింగ్ వేగం కూడా పెరిగిందని తెలిపారు. మరో వరల్డ్‌కప్ ఆడాలనే కోరిక ఉందని కూడా భువీ చెప్పారు.
భువీని టీ20లకు మాత్రమే తీసుకున్నా.. సెలెక్టర్ల దృష్టిలో 2027 వన్డే వరల్డ్‌కప్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బౌలింగ్‌పై పెద్దగా సందేహం లేకపోయినా, 50 ఓవర్ల క్రికెట్‌లో శరీరం ఎంతవరకు లోడ్ తీసుకోగలదనేది చూడాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. భువీ చివరిసారి 2023లో విజయ్ హజారే ట్రోఫీ ఆడారు.
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్‌లో మొదలవుతుంది. మొత్తం ఐదు మ్యాచ్‌లు ఉంటాయి. జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ టీ20 సిరీస్‌లో విశ్రాంతి ఇచ్చారు. అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌తో పాటు భువీ పేస్ విభాగంలో ఉన్నారు. నాలుగేళ్ల తర్వాత వచ్చిన ఈ అవకాశం టీ20ల వరకే ఉంటుందా.. 2027 వరల్డ్‌కప్ దాకా తీసుకెళ్తుందా అనేది ఇప్పుడు ఫిట్‌నెస్, బౌలింగ్‌పై ఆధారపడి ఉంటుంది.
This post was last modified on October 7, 2026 10:35 am
ముందే హెచ్చరిక ఉన్నప్పటికీ ప్రకృతిని పూర్తిగా ఎదురుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుతం రాజమండ్రి, కాకినాడ కేంద్రంగా ముంచేస్తున్న అర్నబ్…
తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకడైన ధనుష్.. ప్రయోగాల నుంచి కొంచెం పక్కకు వచ్చి ఈసారి పక్కా కమర్షియల్ సినిమానే చేస్తున్నట్లున్నాడు.…
తండేల్ తర్వాత ఏడాది గడిచినా నాగచైతన్య నుంచి కొత్త సినిమా రాలేదు. అభిమానులు ఎదురు చూసి చూసి నెలలు అయిపోయాయి…
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. ఈ ఇద్దరిలో ఎవరి సినిమా రిలీజైనా సోషల్ మీడియా హీటెక్కిపోవడం మామూలే. వాళ్లు చేసే…
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మంచి అంచనాల మధ్య కొన్ని నెలల ముందు హీరోగా అరంగేట్రం చేశాడు ఘట్టమనేని…
నాలుగు దశాబ్దాలకు పైగా నటప్రస్థానంలో దర్శకులు ఆర్ నారాయణమూర్తి ఏనాడూ తన బాటను వీడింది లేదు. సమాజానికి సందేశాన్ని ఇచ్చే…