Movie News

వెయ్యి కోట్ల దురంధర్… అక్కడేమో డిజాస్టర్

పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు వస్తాయా అనే అనుమానంతో మొదలై ఏకంగా వేయి కోట్లు దాటడం చూసి ట్రేడ్ వర్గాలు నివ్వెరబోయి చూశాయి. పాకిస్థాన్ లో ఈ సినిమాని బ్యాన్ చేస్తే పైరసీ సైట్లను క్రాష్ అయ్యే రేంజ్ లో అక్కడి ఆడియన్స్ ఎగబడి చూశారు. దురంధర్ ది రివెంజ్ కూడా ఇంతే స్థాయిలో అరాచకం సృస్టించింది. మరి ఫెయిల్యూర్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో చూద్దాం.

మొన్న జూలై 10 దురంధర్ ని జపాన్ లో రిలీజ్ చేశారు. ప్రమోషన్లు గట్రా బాగానే చేశారు. హీరో రణ్వీర్ సింగ్ ప్రత్యేకంగా వీడియో మెసేజ్ చేసి పంపించాడు. ఇంత జరిగాక మొదటి రోజు దేశం మొత్తం మీద వచ్చిన అడ్మిషన్లు కేవలం 900. సరే ఫస్ట్ డే కదా మెల్లగా టాక్ వస్తుందేమోనని ఎదురు చూస్తే శని ఆదివారాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉండటంతో డిజాస్టర్ ఫిక్స్ అయిపోయింది. మొదటి వీకెండ్ ఇండియన్ టాప్ 25లో చోటు దక్కించుకోవడం అవమానమే.

అయితే ఈ ఫ్లాప్ ని అర్థం చేసుకోవాల్సిన కోణం మరొకటి ఉంది. జపాన్ భాషలో దురంధర్ ని డబ్బింగ్ చేయలేదు. కేవలం జపాన్ సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేశారట. దీంతో పబ్లిక్ కి పెద్దగా ఆసక్తి కలగలేదని అక్కడి మీడియా టాక్. పైగా పాకిస్థాన్ నేటివిటీ ఉన్న ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ అక్కడి వాళ్ళు చూసేందుకు అంతగా ఇష్టపడరు. ఎమోషన్ కన్నా యాక్షన్ ఎక్కువగా ఉండే ఇలాంటి వాటికి సహజంగానే దూరం ఉండే జపాన్ జనాలు దురంధర్ కి అదే చేశారు.

వరస చూస్తుంటే దురంధర్ రివెంజ్ ని జపాన్ లో విడుదల చేయడం కష్టమే. దీని స్థానంలో బ్లూరే డిస్క్ రూపంలో నేరుగా హోమ్ ఎంటర్ టైన్మెంట్ రిలీజ్ చేయడం బెస్ట్. అయినా దంగల్ ఆడిందనో ఆర్ఆర్ఆర్ చూశారనో ప్రతి భారతీయ సినిమాను జపాన్ వాళ్ళు చూస్తారనుకోవడం పొరపాటు. వాళ్ళు విజువల్స్, విఎఫ్ఎక్స్ కన్నా కట్టిపడేసే భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తారు. అందుకే అమీర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్ లాంటివి హిట్టయ్యాయి. అంతేమరి ఒక్కో దేశానికి ఒక్కో టేస్టు.

This post was last modified on July 14, 2026 5:12 pm

Share

Recent Posts

శివన్న ‘బెయిల్’కి ప్రేమ దెబ్బ పడింది

జైలర్ తో శివరాజ్ కుమార్ మనకూ దగ్గరయ్యారు. పెద్దిలో రామ్ చరణ్ గురువుగా నటించి దానికీ ప్లస్ అయ్యారు. గౌతమీపుత్ర…

52 minutes ago

రంగస్థలం కాంబో… అసలు టార్గెట్ ఏంటి

పెద్దికి అంత కష్టపడినా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు…

2 hours ago

రికమండేషన్ లేకుండానే కార్యకర్తలకు పదవులు

ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…

2 hours ago

ఇప్పటి వరకు గెలుపులు… ఇకపై మలుపులు

నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…

3 hours ago

జిమ్ జిమ్ తార… కావాలనే వైరల్ చేసారా?

జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…

3 hours ago

69 ల‌క్ష‌ల ఓట్లు హుష్‌..

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(సర్‌)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…

4 hours ago