Political News

రికమండేషన్ లేకుండానే కార్యకర్తలకు పదవులు

ఎవరి రికమండేషన్ అవసరం లేదు… ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు చేయాల్సిందల్లా పార్టీ కోసం కమిట్మెంట్ తో పనిచేయడం. మీ ట్రాక్ రికార్డ్ ఒక్కటే అర్హతగా పరిగణలోకి తీసుకుంటామని టీడీపీ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఇదిప్పుడు టీడీపీ కేడర్ కు మాంచి ఊపునిస్తుంది. నిన్నా మొన్నటి వరకు పార్టీ పదవి కోసం కావచ్చు, నామినేటెడ్ పోస్ట్ కోసం కావచ్చు స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు చేయాల్సి వచ్చేది. ఇంకొకరెవరైన ఒక మాట చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడది లేకుండానే పదవి కొట్టేయోచ్చని టీడీపీ కార్యకర్తలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

ఉండవల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో తనను కలసిన మీడియా ప్రతినిధులతో లోకేశ్​ మాట్లాడుతూ… త్వరలో నామినేట్ పోస్టులు భర్తీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతుందని చెప్పారు. ఈసారి ఎలాంటి సిఫార్సులు లేకుండానే పదవులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను ఇప్పటికే 150 మంది నాయకులు, సామాన్య కార్యకర్తలను గుర్తించినట్లు చెప్పారు.

వీరందరికీ ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇస్తామన్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో నిబద్ధతతో పాల్గొన్నవారిని గుర్తించి వారి స్థాయిని, సామర్థ్యాన్నిబట్టి రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్‌ పదవుల్లో నియమిస్తామన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన మొత్తం ఆరు కార్యక్రమాల్లోనూ అత్యుత్తమ పనితీరు కనబరిచి అవార్డులు అందుకున్న వారికి తొలి ప్రాధాన్యమిస్తామని ఆ తర్వాత ఐదు, నాలుగు కార్యక్రమాల్లో అవార్డులు సాధించినవారికి అవకాశమిస్తామని వివరించారు.

టీడీపీకీ కేడర్, లీడర్ పార్టీగా దేశంలోనే మంచి పేరుందని, కార్యకర్తల సంక్షేమం కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పార్టీ దేశంలో ఎక్కడా లేదన్నారు. కార్యకర్తల కోసం టీడీపీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఇతరా పార్టీలు కాపీ కొట్టే పనిలో ఉన్నాయని కామెంట్ చేశారు. అయినా సరే టీడీపీ కార్యకర్తలకు సరిజోడిగా ఎవ్వరూ నిలబడలేరన్నారు.

టీడీపీలో మొదట్నుంచి కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. సామాన్య కార్యకర్తలు ఎందరో అందలం ఎక్కిన చరిత్ర వుందన్నారు. ఇటీవల ఒక అంగన్వాడీ కార్యకర్తకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. జర్నలిస్టులను ఎంపీలను చేసి పార్లమెంటుకు పంపించిందని చెప్పారు. బీసీ రిజర్వేషన్ కు వైసీపీ మోకాలడ్డుతోందని ఆరోపించారు. హై కోర్టుకు అబ్జక్షన్ చెప్పినప్పటికి సుప్రీం కోర్టుకు వెళ్లామని, అక్కడ తీర్పు సానుకూలంగా వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

This post was last modified on October 7, 2026 2:09 pm

Share

Recent Posts

ఇప్పటి వరకు గెలుపులు… ఇకపై మలుపులు

నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…

19 minutes ago

జిమ్ జిమ్ తార… కావాలనే వైరల్ చేసారా?

జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…

45 minutes ago

69 ల‌క్ష‌ల ఓట్లు హుష్‌..

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(సర్‌)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…

1 hour ago

ఇది కియారా అద్వానీకే సాధ్యం

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…

2 hours ago

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…

2 hours ago

నష్టాలు వచ్చాయని ఒప్పుకున్న నాని

తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…

2 hours ago