జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో చూసినా తెలుగు వాళ్లను ఊపేస్తన్న పాట ఇది. లక్ష్మి అనే కర్నూలుకు చెందిన ఒక మహిళ క్యాజువల్‌గా పాట పాడి సోషల్ మీడియాలో పోస్టు చేస్తే ఆ పాట తెగ వైరల్ అయిపోయినట్లు అందరూ చెప్పుకుంటున్నారు. ఆమె పాడిన పాట మామూలుగానే ఉన్నా.. దానికి ఎవరో రీమిక్స్ వెర్షన్ యాడ్ చేశారు.
అది మంచి వైబ్‌తో ఉండడంతో పాట వైరల్ అయిపోయింది.
దీంతో పాటుగా అత్తరు సాయిబు.. అంటూ ఆమె పాడిన మరో పాట కూడా వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ రెండు పాటల రీమిక్స్ వెర్షన్లు ఊపేస్తున్నాయి. వాటికి అదిరిపోయే ఎడిట్స్ జోడించి ఇంకా పాపులర్ చేస్తున్నారు. ఏం వైబ్ ఉంది అంటూ అందరూ ఈ పాటల్ని షేర్ చేస్తున్నారు.
ఈ పాటల రెఫరెన్సులను త్వరలోనే సినిమాల్లో చూస్తాం అనుకుంటుండగా.. ఒక సినిమా టీం షాకింగ్ ట్విస్టు ఇచ్చింది. ఆ సినిమా పేరు.. పర్ణశాల. దీని నిర్మాత ఒక నోట్ రిలీజ్ చేశాడు. ‘జిమ్ జిమ్ తార’ పాట తమ సినిమాలోనిదే అని వెల్లడించాడు. తాము ఆ పాటను రిలీజ్ చేయడానికి ముందే ఫోక్ సింగర్ సరదాగా ఈ పాటను పాడి సోషల్ మీడియాలో పెట్టిందని, దాని రీమిక్స్ వెర్షన్ వైరల్ అయిందని ఆ ప్రొడ్యూసర్ వెల్లడించాడు.
ఇది తాము ఉద్దేశపూర్వకంగా చేసిందేమీ కాదని.. అనుకోకుండా ఆ పాట వైరల్ అయిందని.. దానికి వచ్చిన ఆదరణ సంతోషమే అని.. ఇలాగే తమ సినిమాను కూడా ఆదరించాలని మంచి వెంకట్ అనే ఆ నిర్మాత కోరాడు. ఈ చిత్రాన్ని వైజీ భరత్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తుండగా.. నటీనటుల వివరాలేవీ ఇంకా బయటికి రాలేదు. ‘జిమ్ జిమ్ తార’ పాట వైరల్ కావడం చూసి టీం ఈ సినిమా ప్రి లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. అది కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. త్వరలోనే సినిమాకు సంబంధించి పూర్తి విశేషాలను వెల్లడించనున్నారు.
This post was last modified on October 7, 2026 1:49 pm
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…
ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…
మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…
తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…
21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…
కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్…