జైలర్ తో శివరాజ్ కుమార్ మనకూ దగ్గరయ్యారు. పెద్దిలో రామ్ చరణ్ గురువుగా నటించి దానికీ ప్లస్ అయ్యారు. గౌతమీపుత్ర శాతకర్ణిలో బుర్రకథ పాటతో డెబ్యూ చేసినా ఆయనకు పేరు తీసుకొచ్చింది మాత్రం ముందు చెప్పిన రెండు సినిమాలు. కన్నడ సీనియర్ మోస్ట్ స్టార్ హీరోగా రాజ్ కుమార్ లెగసిని కాపాడుకుంటూ వస్తూ, తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ లేని లోటుని అభిమానులకు ఫీలవ్వకుండా వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. మొన్న అక్టోబర్ 2 భారీ ఎత్తున బెయిల్ విడుదలయ్యింది.
ట్విస్ట్ ఏంటంటే ఇది నిర్మించింది కెవిఎన్ ప్రొడక్షన్స్. వరసగా డిజాస్టర్లు చవి చూస్తున్న ఈ భారీ సంస్థ జన నాయకుడు, టాక్సిక్ రూపంలో పెద్ద ఎత్తున నష్టాలు చవి చూసింది. ఇంతకు ముందు కన్నడలోనే తీసిన కెడి డెవిల్ కూడా ఫ్లాపుల లిస్టులోకి చేరిపోయింది. అందుకే బెయిల్ మీద భారీ నమ్మకం పెట్టుకుంది. అయితే ప్రేమద ఊరల్లి అనే చిన్న సినిమా తాకిడికి బెయిల్ నిలవలేకపోతోందని బెంగళూరు టాక్. జనం తండోపతండాలుగా దానికే వెళ్లడం వసూళ్లను ప్రభావితం చేస్తోంది.
ఇంతకీ బెయిల్ కథేంటంటే రిటైర్డ్ పోలీస్ కమీషనర్ విజయ్ కుమార్ వ్యక్తిగత జీవితంలో ఒక విషాదం ఉంటుంది. కన్న కూతురిని కోల్పోయాక ఆమె చావుకు కారణమైన వాళ్ళు బయట తిరగడం చూసి తట్టుకోలేక పోతాడు. దీంతో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఇద్దరు స్నేహితుల సహాయంతో ఇలా తప్పించుకుని తిరుగుతున్న వాళ్ళను చంపడం మొదలుపెడతాడు. ఈ కేసు ఒక యువ పోలీస్ ఆఫీసర్ తీసుకుంటాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య జరిగే డ్రామానే తెరమీద చూసే అసలు స్టోరీ.
క్రైమ్ థ్రిల్లర్ గా నడిపించాల్సిన సినిమాని దర్శకుడు పవన్ వడయార్ కమర్షియల్ ఫార్మాట్ లో నడిపించడంతో బెయిల్ ఎలాంటి ప్రత్యేకత లేకుండా సాగుతుంది. శివన్న అభిమానులకు ఓకే అనిపించినా రెగ్యులర్ ఆడియన్స్ కి మాత్రం ఇందులో ఎలాంటి ప్రత్యేకత కనిపించదు. రొటీన్ సీన్లతో ఈజీగా గెస్ చేసేలా కథకథనాలు నడిపించారు. శివరాజ్ కుమార్ తో పాటు జయరాం, సాయికుమార్, దీక్షిత్ శెట్టి లాంటి ఆర్టిస్టుల వల్ల నిండుతనం అయితే వచ్చింది కానీ కంటెంట్ వాళ్ళను పూర్తిగా వాడుకోలేదు.
This post was last modified on October 7, 2026 4:42 pm
పెద్దికి అంత కష్టపడినా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు…
ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…
నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…
జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…
ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…