Political News

69 ల‌క్ష‌ల ఓట్లు హుష్‌..

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన… స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(సర్‌)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి 40 రోజులు అయిపోయింది. ఆ తర్వాత.. మళ్లీ కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. అదేసమయంలో సర్ ప్రక్రియలో ఓట్లు గల్లంతైన వారికి కూడా అవకాశం కల్పించారు. వారు కూడా ప్రత్యేక ఫారాలు సమర్పించి 2002 నాటి సర్ జాబితాలోని వివరాలను అందించి.. కొత్తగా ఓటు హక్కు పొందే అవకాశం ఇచ్చారు. ఈ ప్రక్రియకు అక్టోబరు 7(బుధవారం)తో గడువు పూర్తవుతుంది. దీనికి సంబంధించి తెలంగాణ ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.

73 లక్షల 39 వేల ఓట్లను తాము తొలగించామని.. వీరిని కొత్తగా 2002 నాటి జాబితా వివరాలతో నమోదు చేసుకోవాలని కోరామని అధికారులు వెల్లడించారు. కానీ, కేవలం 4 లక్షల 64 వేల మంది మాత్రమే తిరిగి దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. అంటే.. సుమారు 69 లక్షల 50 వేల మంది అనర్హులయ్యారు. దీంతో వీరి ఓట్లు పూర్తిగా తొలిగిపోయాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సంఖ్యలో వీరి నెంబరు లేకుండా పోతుంది. ఇది హైదరాబాద్ సహా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. ఒకరకంగా ఇది రాజకీయంగా కూడా వివాదం అయ్యే అవకాశం ఉంది.

ఇక‌, ఏం చేయాలి?

ప్రస్తుత సర్ జాబితాలో పేర్లు పోయిన వారు మరోసారి కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో వారు మరోసారి ఫాం-6ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా గతంలో కంటే భిన్నంగా ఉన్న నేపథ్యంలో సానుకూలంగానే వారికి హక్కు లభించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక‌, 11వ తేదీ వరకు గత సర్ జాబితాలపై అభ్యంతరాలు తీసుకునే అవకాశం ఉన్నా.. ప్రచారం సరైన విధంగా లేకపోవడంతోనే లక్షలాది మంది నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని తెలుస్తోంది. ఇక‌, రాష్ట్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? సంఖ్య ఎంత? అనేది ఈ నెల 9న తుది జాబితా విడుదల కానుంది.

This post was last modified on October 7, 2026 1:51 pm

Share

Recent Posts

ఇది కియారా అద్వానీకే సాధ్యం

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…

58 minutes ago

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…

1 hour ago

నష్టాలు వచ్చాయని ఒప్పుకున్న నాని

తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…

1 hour ago

చివరి మ్యాచ్‌లోనూ అదే మెస్సీ… వారసుడికే గోల్ ఇచ్చి వెళ్లాడు!

21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…

1 hour ago

అక్కడ కలెక్షన్ల వర్షం… ఇక్కడ వసూళ్ల నీరసం

కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్…

2 hours ago

వరప్రసాద్ స్నేహితులకు ఒకే సమస్య

మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…

3 hours ago