Trends

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం… మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం… అది కూడా ఏళ్ల తరబడి తన పగను మరిచిపోకుండా జీవనం సాగించడం… ఎప్పుడూ వినలేదు కదా. నిజమే…ఏనుగులు పగబట్టిన మాట ఇప్పటిదాకా వినలేదు. తమ ఉనికికి ప్రమాదం సంభవిస్తోందని భావించిన సందర్భంలోనే ఏనుగులు ఒకింత టెన్షన్ కు గురై అడ్డమొచ్చిన వారిని తొక్కేసుకుంటూ వెళ్లిపోతాయి. అయితే నేపాల్ లో ఇటీవలే జరిగిన ఓ ఘటన చూస్తే… ఏనుగులకూ పగబట్టడం తెలుసు అని ఒప్పుకోక తప్పదు. 

ఒక కుటుంబంలోని ఇద్దరిని పొట్టనబెట్టుకున్న ఓ నేపాలీ ఏనుగు దాదాపుగా 14 ఏళ్ల తర్వాత ఆ కుటుంబాన్ని వెతుక్కుంటూ మరీ సాగి… అదే కుటుంబంలోని మరో ఇద్దరిని చంపేసింది. తొలి ఘటన తర్వాత అక్కడి నుంచి చాలా దూరం పారిపోయిన సదరు కుటుంబం.. ఏనుగు నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఏకంగా నదులనే దాటేసి వెళ్లిందట. అయినా కూడా ఆ ఏనుగు 14 ఏళ్ల తర్వాత తిరిగీ ఆ కుటుంబం ఆచూకీని తెలుసుకుని మరీ…నేరుగా ఇంటిలోకి చొరబడి మరో ఇద్దరిని పొట్టనబెట్టుకుంది. వినడానికి వింతగా ఉన్నా… ఇది నిజంగా జరిగిన ఘటన.

నేపాల్ లోని చిట్వాన్ జాతీయ పార్క్ కు సమీపంలోని మడి గ్రామంపై విరుచుకుపడిన దుర్బే అనే ఓ ఏనుగు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులను చంపేసింది. ఈ ఘటన 2012లో జరగగా… ఆ కుటుంబ యజమాని శనిచర బోటే బెంబేలెత్తిపోయారు. ఏనుగుల గురించి ఒకింత బాగానే తెలిసిన బోటే…తన కుటుంబంపై జరిగిన ఏనుగు దాడిని తలచుకుని మరీ భయకంపితులయ్యాడు. మున్ముందు ఆ ఏనుగు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునే నిమిత్తం ఃఅతడు తాను ఉంటున్న మడి గ్రామాన్ని వదిలేశాడు. అక్కడి నుంచి నదులు దాటేసి 9 మైళ్ల దూరం వెళ్లిన ఆయన జగత్ పూర్ అనే ఓ చిన్న గ్రామంలో నివాసం ఏర్పరచుకున్నారు.

అలా 2012 నాటి ఘటనను మదిలో నుంచి చెరిపేసుకుని మిగిలిన కుటుంబ సభ్యులతో అతడు ప్రశాంతంగానే జీవిస్తున్నాడు. అలా సాగుతున్న వారి జీవితంలోకి దుర్బే మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. మడి గ్రామాన్ని వీడి బోటే వచ్చి ఉంటున్న జగత్ పూర్ దాకా వచ్చేసిన దుర్బే… నేరుగా బోటే ఇంటిలోకిని చొరబడింది. ఆ సమయంలో ఆ ఇంటిలో ఉన్న బోటే కోడలు, మనవడిని ఆ ఏనుగు చంపేసింది. దీంతో బోటే కుటుంబంలో ఆ ఏనుగు కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఏకంగా నాలుగుకు చేరింది. విషయం తెలుసుకున్న బోటే… నదులు దాటి మరీ వచ్చినా… 14 ఏళ్ల తర్వాత కూడా దుర్బే తన కుటుంబాన్ని వెంటాడుతూ వచ్చిందంటే…దానికి తన కుటుంబంపై పగ ఉన్నట్టేనని బోరుమంటున్నాడు. 

ఈ మదపుటేనుగు ఈ నాలుగు ప్రాణాలు మాత్రమే తీయలేదట. ఇప్పటిదాకా ఈ ఏనుగు దాడిలో ఏకంగా 25 మంది దాకా ప్రాణాలు కోల్పోయారట. ఈ ఏనుగు గురించి ఓ మోస్తరు అవగాహన ఉన్న నేపాల్ అటవీ శాఖ అధికారులు… దానికి ట్రాకర్ ను అమర్చినా… ఆ ట్రాకర్లనూ విసరికొట్టేసిన దుర్బే… మనుషులను చంపుతూనే సాగుతోందట. ఇప్పటిదాకా ఈ ఏనుగుకు మూడు సార్లు ట్రాకర్టను ఏర్పాటు చేసినా… దానిని కంట్రోల్ చేయడం సాధ్యం కాదేలని అదికారులు చెబుతున్నారు.

This post was last modified on July 14, 2026 2:29 pm

Share

Recent Posts

రికమండేషన్ లేకుండానే కార్యకర్తలకు పదవులు

ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…

18 minutes ago

ఇప్పటి వరకు గెలుపులు… ఇకపై మలుపులు

నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…

33 minutes ago

జిమ్ జిమ్ తార… కావాలనే వైరల్ చేసారా?

జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…

60 minutes ago

69 ల‌క్ష‌ల ఓట్లు హుష్‌..

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(సర్‌)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…

2 hours ago

ఇది కియారా అద్వానీకే సాధ్యం

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…

2 hours ago

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…

2 hours ago