జనం థియేటర్లకు రావడం తగ్గించేశారని.. సినిమాల పరిస్థితి అథోగతే అని నెల కిందట సినీ జనాలు తీవ్రంగా ఆందోళన చెందారు. కానీ మంచి సినిమాలు తీస్తే.. టికెట్ల ధరలు అందుబాటులో ఉంటే జనం ధారాళంగా థియేటర్లకు వస్తారని.. సినిమాలను నెత్తిన పెట్టుకుంటారని ఇటీవల కొన్ని చిత్రాలు రుజువు చేశాయి. ముఖ్యంగా గత నెలలో వచ్చిన ‘మా ఇంటి బంగారం’ ఎవ్వరూ ఊహించని విధంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఈ నెలలో ‘లెనిన్’ సినిమా సైతం అంచనాలను మించిన స్పందన తెచ్చుకుంది. తొలి వీకెండ్లో ఈ చిత్రం రూ.40 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. అఖిల్ రేంజికి ఇది చాలా పెద్ద నంబరే. ఐతే టాక్ కొంచెం మిక్స్డ్‌గా ఉన్న నేపథ్యంలో వీకెండ్ తర్వాత ఈ చిత్రం ఏమేర నిలబడుతుందో అన్న సందేహాలు కలిగాయి. కలెక్షన్లు బాగా డ్రాప్ అవుతాయేమో అని ట్రేడ్ అనుమానించింది.
ఐతే ఆదివారం తర్వాత ‘లెనిన్’ కలెక్షన్లు తగ్గాయి కానీ.. మరీ డ్రాప్ ఏమీ అవ్వలేదు. సోమవారం కూడా ఈ చిత్రం రూ.5 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటిదాకా నిఖార్సయిన హిట్ లేని, మార్కెట్ క్రియేటవ్వని హీరో సినిమాకు వర్కింగ్ డేలో ఈ వసూళ్లు అంటే గొప్ప విషయమే. మంగళవారం కూడా ‘లెనిన్’కు బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి. ఈ వారం గట్టి పోటీనిచ్చే సినిమాలు లేని నేపథ్యంలో ‘లెనిన్’ రెండో వీకెండ్లో కూడా మంచి వసూళ్లే రాబడుతుందని భావిస్తున్నారు.
ఈ చిత్రం ఇప్పటిదాకా దాదాపుగా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ అయినట్లుగా నిర్మాత చెబుతున్నారు. అందులో నిజమెంతో కానీ.. ఫుల్ రన్లో ‘లెనిన్’ బయ్యర్లందరూ లాభాలందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అఖిల్ కోరుకున్న విజయం ‘లెనిన్’తో దక్కినట్లే. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు రూపొందించిన ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మించారు.
This post was last modified on July 14, 2026 6:24 pm
ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…
మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…
తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…
21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…
కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్…
మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…