షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పోక్సో కేసులో అరెస్టైన కుమార్ బెయిల్ పై విడుదలైన వెంటనే బాధిత బాలిక, ఆమె తల్లి, ఆమె నాయనమ్మతో పాటు తన భార్య, ఇద్దరు పిల్లలను కిరాతకంగా హత్య చేయడం సంచలనం రేపింది.
ఆ తర్వాత పరారీలో ఉన్నాడు. కుమార్ ను ఎన్ కౌంటర్ చేయాలని, ఉరిశిక్ష వేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కుమార్ చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు.
కొత్తూరు మండలంలోని పంజర్ల గ్రామం వద్ద ఒక వెంచర్లో అతడి మృతదేహం లభించిందని పోలీసులు తెలిపారు. స్థానికులు సమాచారమివ్వడంతో పోలీసులు అక్కడకు వెళ్లి శవాన్ని పరిశీలించారు.
ఆ మృతదేహం పక్కనే పురుగుల మందు డబ్బా ఉందని, ఆ మృతదేహం కుమార్ దేనని పోలీసులు చెబుతున్నారు. ఆ వెంచర్ కుమార్ బంధువుదని, అక్కడకు వచ్చి కుమార్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, రాజ్ కుమార్ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates